Botsa Satyanarayana: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం ప్రారంభించాలని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి జిల్లాల వరకు ఈ ఉద్యమాన్ని విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమని బొత్స విమర్శించారు.
ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ప్రజలకు తప్పుడు హామీలు ఇస్తూ మాట్లాడారని, ఇప్పుడు మాత్రం ఆయన పౌరుషం కనిపించడం లేదని బొత్స ఎద్దేవా చేశారు. ‘‘ఉప్పు, కారం తినడం లేదా? ప్రజల సమస్యలపై ఎందుకు మౌనం పాటిస్తున్నారు?’’ అని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కేంద్రం సహకరించకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టమవుతోందని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవడం రాష్ట్ర ప్రజలందరి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. అవసరమైతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేస్తామని, కేంద్రం వెనక్కి తగ్గే వరకు పోరాటం కొనసాగుతుందని బొత్స స్పష్టం చేశారు.

