Prabhas– Kannappa: టాలీవుడ్‌లో భారీ అంచనాలతో రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో విష్ణు మంచు కీలక పాత్రలో మెరుస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినీ ప్రియుల్లో ఉత్సాహాన్ని నింపింది. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రతి పాత్రపైనా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఇప్పుడు ‘కన్నప్ప’ టీమ్ హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రమోషనల్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తోంది. ఈ ఈవెంట్‌కు ప్రభాస్‌ను ఆహ్వానించే ఆలోచనలో ఉన్నారట. ఆయన రాకతో సినిమాకు మరింత జోష్ రానుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ప్రభాస్ నిజంగానే ఈ ఈవెంట్‌లో పాల్గొంటాడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ భారీ చిత్రం ప్రేక్షకులను ఎలా మెస్మరైజ్ చేయనుందో చూడాలి.