Sydney Terror Attack

Sydney Terror Attack: కొడుకు ఉగ్రవాది అంటే నమ్మలేకపోతున్నా!.. బోండి బీచ్ షూటర్ తల్లి ఆవేదన

Sydney Terror Attack: ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని ప్రసిద్ధ బోండి బీచ్‌ (Bondi Beach) వద్ద జరిగిన మారణహోమం ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ దాడిలో నిందితులుగా గుర్తించబడిన తండ్రి, కొడుకులు పాకిస్థాన్‌కు చెందిన వారని పోలీసులు ధృవీకరించారు. దాడి తర్వాత, ఈ ఘటనలో నిందితుడైన 24 ఏళ్ల నవీద్ అక్రమ్ తల్లి వెరీనా చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి.

నిందితుడు నవీద్ అక్రమ్, అతని తండ్రి సాజిత్ అక్రమ్ (50) కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఈ దాడిలో నిందితుడితో సహా మొత్తం 16 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు.

అలాంటి కొడుకు కావాలని ఎవరైనా కోరుకుంటారు

తన కొడుకు ఇంత పెద్ద నేరానికి పాల్పడ్డాడంటే నమ్మలేకపోతున్నానని, తమ బిడ్డ చాలా మంచివాడని తల్లి వెరీనా మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు.

నా కొడుకు లాంటి కొడుకు కావాలని ఏ తల్లైనా కోరుకుంటుంది. వాడు అలా చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను, అని వెరీనా భావోద్వేగంతో మాట్లాడారు.దాడి జరగడానికి కొద్ది గంటల ముందు కూడా నవీద్ తనతో మాట్లాడాడని, అంత మంచివాడు ఉగ్రవాదంలో పాల్గొన్నాడంటే అస్సలు నమ్మలేకపోతున్నానని ఆమె వాపోయారు.

నవీద్‌కి స్నేహితులు తక్కువని, మద్యం, ధూమపానం వంటి చెడు అలవాట్లు లేవని, ఎప్పుడూ చెడ్డ ప్రదేశాలకు వెళ్లడని తల్లి తెలిపారు. “పనికి వెళ్తాడు, ఇంటికొస్తాడు, జిమ్‌కు వెళ్తాడు, అంతే తప్ప ఇంకేమీ తెలియదు,” అని ఆమె తెలిపారు.

చేపల వేట పేరుతో ఘాతుకం

నవీద్ అక్రమ్, సాజిత్ అక్రమ్‌లు ఇంట్లో బంధువులకు తాము “చేపల వేటకు” వెళ్తున్నట్లు చెప్పి బయలుదేరారు. కానీ, వారు చేపల వేట కోసం కాదు, మనుషులను వేటాడేందుకు బయలుదేరారని తల్లి వెరీనా గుర్తించలేకపోయారు.

తండ్రి, కొడుకులు ఇంట్లో ఎటువంటి అనుమానం రాకుండా చాలా రోజులుగా చాలా జాగ్రత్తగా మసులుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నవీద్ అక్రమ్‌కు గత కొంతకాలంగా ఐసిస్ (ISIS) ఉగ్ర సంస్థతో సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. నవీద్ గతంలో సిడ్నీలోని హెకెన్‌బర్గ్‌లోని అల్-మురాద్ ఇన్‌స్టిట్యూట్‌లో ఖురాన్ అధ్యయనాలు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అతడు ప్రస్తుతం తన తల్లిదండ్రులు, తమ్ముళ్లతో కలిసి 2024లో కొనుగోలు చేసిన ఇంట్లోనే నివసిస్తున్నాడు.

దర్యాప్తు అధికారులు ప్రస్తుతం అక్రమ్ కుటుంబ సభ్యులను లోతుగా విచారిస్తున్నారు. అమాయక పౌరులను బలిగొన్న ఈ మారణహోమం వెనుక గల పూర్తి కుట్ర కోణాలను ఛేదించేందుకు ఆస్ట్రేలియా పోలీసులు విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన ఆస్ట్రేలియా భద్రతా వ్యవస్థకు ఒక పెద్ద సవాలుగా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *