బాంబ్ బెదిరింపులతో అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, బస్టాండ్లు అనే తేడా లేకుండా ఆకతాయిలు ఫేక్ కాల్స్ చేస్తూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారానికోసారి ఫోన్ చేస్తూ పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నారు
తాజాగా తిరుపతిలోని కొన్ని హోటళ్లకు వచ్చిన బాంబు బెదిరింపులు.. స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. లీలామహల్ సమీపంలోనున్న మూడు ప్రైవేటు హోటళ్లతో పాటు రామానుజకూడలిలోని మరో హోటల్ ను పేల్చివేస్తామని పేర్కొంటూ.. పోలీసులకు మెయిల్ లో బెదిరింపులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన డీఎస్పీ వెంకటనారాయణ, సిబ్బంది, స్పెషల్ టీం లు తనిఖీలు నిర్వహించారు. పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఎక్కడా పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బెదిరింపు మెయిల్ పై కేసు నమోదు చేసి.. ఆ మెయిన్ పంపిందెవరో తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
