Delhi: బాంబ్ బెదిరింపు ఫోన్ లతో విమానాయలకు 600 కోట్ల నష్టం

బాంబ్ బెదిరింపులతో ఎయిర్ పోర్ట్ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, బస్టాండ్లు అనే తేడా లేకుండా ఆకతాయిలు ఫేక్ కాల్స్ చేస్తూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారానికోసారి ఫోన్ చేస్తూ పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నారు.

ఫోన్‌లు, ఈమెయిళ్లు, సోషల్‌ మీడియా ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు చేస్తున్న బెదిరింపులతో విమాన ప్రయాణాలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నది. ఫలితంగా విమానయాన సంస్థలు నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తున్నది.గత తొమ్మిది రోజుల్లోనే 170 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.విమానంలో బాంబు పెట్టాం’ అని దుండగులు, ఆకతాయిలు పంపిస్తున్న హెచ్చరికలతో విమానాశ్రయాల్లో హైరానా నెలకొంటున్నది.

ఏ విమానానికి బాంబు బెదిరింపు వచ్చినా కచ్చితంగా బాంబు థ్రెట్‌ అసెస్‌మెంట్‌ కమిటీ(బీటీఏసీ) ప్రొటోకాల్‌, అంతర్జాతీయ మార్గదర్శకాల ప్రకారం తనిఖీల ప్రక్రియను చేపట్టాల్సిందే.

ఫలితంగా విమానయాన సంస్థలు నష్టపోతున్నాయి. గత తొమ్మిది రోజుల్లో వచ్చిన బాంబు బెదిరింపులకు విమానయాన సంస్థలు దాదాపుగా 600 కోట్లు నష్టపోయి ఉంటాయని గతంలో ఓ విమానయాన సంస్థలో పని చేసిన ఓ అధికారి తెలిపారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *