Tirupati

Tirupati: తిరుపతికి మరో బాంబు బెదిరింపు ఈ-మెయిల్..

Tirupati: తిరుపతి నగరంలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. శనివారం తెల్లవారుజామున స్థానిక పోలీసులకు, అధికారులకు గుర్తుతెలియని వ్యక్తులు ఈ-మెయిల్‌ పంపారు. ఆ మెయిల్‌లో ఇస్కాన్‌ ఆలయంతో పాటు మూడు ప్రదేశాల్లో పేలుడు పరికరాలు (IEDలు) పెట్టినట్లు హెచ్చరించారు. తప్పుడు రీతిలో హ్యాండిల్ చేస్తే అవి ఏ క్షణమైనా పేలిపోతాయని ఆగంతకులు మరో మెయిల్‌లో స్పష్టం చేసినట్టు సమాచారం.

ఈ సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌లు ఉదయం నుంచే అత్యవసర తనిఖీలు ప్రారంభించాయి. ఆలయాలు, రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌ వంటి రద్దీ ప్రదేశాల్లో విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి.

ఇది కూడా చదవండి: Dhruv Jurel: ధ్రువ్ జురెల్ తొలి టెస్ట్ సెంచరీ.. భారత సైన్యానికి అంకితం

ఇక ప్రత్యేక విషయం ఏమిటంటే.. ఆ ఈ-మెయిల్‌లో కరూర్‌ తొక్కిసలాట ఘటన కేసును సీబీఐకి బదిలీ చేయాలని డిమాండ్‌ కూడా ఉంచారు. అంతేకాకుండా ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన బ్లాస్ట్స్ తర్వాత స్నైపర్‌ దాడులు జరుగుతాయని కూడా బెదిరించారు.

ప్రస్తుతం సైబర్‌ సెల్‌ ఈ-మెయిల్‌ మూలాన్ని గాలిస్తోంది. ఈ బెదిరింపులు నిజమా? లేక ఎవరైనా భయపెట్టడానికి చేసిన చర్యమా? అన్నది తేలాల్సి ఉంది. ఏదేమైనా, పవిత్ర తీర్థనగరంలో వరుస బాంబు బెదిరింపులు భక్తులు, ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *