Delhi:విమానంలో తరచూ కొందరు బాంబు బెదిరింపు కాల్స్‌తో రక్షణ వ్యవస్థ మొత్తం అతలాకుతలం అవుతుంది. కొందరు ఆకతాయిలు సరదా కోసం చేస్తారు. మరికొందరు అతివాదులు ఆగ్రహంతో చేస్తారు. ఇంకొందరు ఉగ్రవాదులూ మన రక్షణ వ్యవస్థను దిగజార్చేందుకు ఇలాంటి బెదిరింపు కాల్స్‌కు పాల్పడుతుంటుంటారు. సున్నితమైన అంశమైన ఇలాంటి బెదిరింపు కాల్స్ చేసే వారికి ఇక నుంచి గట్టి చర్యలు తీసుకోనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది.
Delhi:విమానాలపై బాంబు బెదిరింపు కాల్స్ చేసేవారిని నోఫ్లై జాబితాలో చేర్చేందుకు, జీవిత ఖైతు విధించేలా చట్టపరమైన మార్పులు తేవాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. దీంతోపాటు కఠిన శిక్షలు విధించేలా, జరిమానాలూ వేసేలా చట్టంలో మార్పులను సవరించాలనీ చూస్తున్నది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు తాజాగా ఈ హెచ్చరికలు చేశారు.
Delhi:కేంద్ర మంత్రి యోచనలో ఉన్న ఈ విషయాలపై త్వరలో చట్టంలో మార్పలు చేర్పులు ఉంటాయని భావిస్తున్నారు. ఫోన్ బెదిరింపు కాల్స్ చేసే వారిపై పైన చెప్పిన కఠిన నిర్ణయాలు తీసుకుంటే కొంతైనా మార్పు వస్తున్నదేమో చూడాలి మరి.