Hyderabad: హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు ఉన్నట్లు వచ్చిన సమాచారం కలకలం రేపింది. మియాల్ రవాణా కేంద్రంలో బాంబు ఉందన్న అనుమానంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడ ఉన్న ప్రజలను ఖాళీ చేయించడంతో పాటు, పోలీసు బాంబ్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్ సాయంతో విస్తృత తనిఖీలు చేపట్టారు.
ఈ సమయంలో ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల రాకపోకలపై ప్రభావం పడింది. పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొన్న అధికారులు ఎటువంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పరిశీలన అనంతరం అది తప్పుడు అలర్ట్‌గా నిర్ధారించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.