Cake Blast Video: ప్రస్తుతం ఆన్‌లైన్ ప్రపంచంలో, సోషల్ మీడియా విడుదల క్రేజ్‌తో నిండిపోయినట్లు కనిపిస్తోంది. చాలా మంది సోషల్ మీడియాలో రీల్స్ చూడటం లేదా రీల్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేయడం, వాటి ద్వారా ఫేమస్ అవ్వడం పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని ప్రత్యేకమైనవి గా నిలుస్తుంటే.. కొన్ని పిచ్చితనంగా అనిపిస్తాయి. ఇదిగో అలాంటిదే ఓ వీడీయో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. పుట్టినరోజు పార్టీలో కేక్ కట్ చేస్తున్నప్పుడు జరిగిన ఈ సంఘటన గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఒక కుటుంబంలో, ఒక మహిళ తన పుట్టినరోజు జరుపుకోవడానికి కేక్ కట్ చేస్తారు.
ఆ మహిళ కేక్ కోసేలోపే పెద్ద శబ్దంతో కేక్ పేలిపోయింది. వాళ్ళు క్రీమ్ కు బదులుగా కేక్ లోపల ఒక పెద్ద పటాకుల బాంబు పెట్టారు. ఈ సందర్భంలో, ఆమె కేక్ మీద కొవ్వొత్తి వెలిగించింది. వెంటనే సెకన్లలోనే, ఆ కేక్ పేలిపోయింది. ఎంతలా అంటే అసలు అక్కడ ఒక కేక్ ఉండనే సంగతే తెలియనట్టుగా.
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో, కొంతమంది పుట్టినరోజు పార్టీలో కలిసి నిలబడి ఉన్నారు. వారి ముందు కట్ చేయడానికి ఒక కేక్ సిద్ధంగా ఉంది. కేక్ పైన కమలం ఆకారంలో ఉన్న కొవ్వొత్తిని కూడా ఉంచారు. అక్కడ పుట్టినరోజు పార్టీ చేసుకుంటున్న ఆ మహిళ, కొవ్వొత్తి వెలిగించి భయంతో ఒక అడుగు వెనక్కి వేసింది.
ఇది కూడా చదవండి: Viral News: వీడు ఎవడ్రా బాబు.. అమిత్ షా పేరు వాడుకొని.. ఎమ్మెల్యే ని బెదిరించాడు
అప్పుడు కొవ్వొత్తి వెలిగింది. కానీ, ఆ సమయంలో, ఊహించని సంఘటన జరిగింది. అందరూ చూస్తుండగానే, కేక్ అకస్మాత్తుగా పేలిపోయింది. కేక్ అక్కడంతా చెల్లాచెదురుగా పడి పోయింది.
కానీ, అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వీడియో వైరల్ అవుతోంది.
వీడియో చుసిన వారు వార్నీ విళ్ళ పిచ్చి తగలెయ్య.. ఏదైనా ప్రమాదం జరిగితే ఎంత ఇబ్బంది అయ్యేది అని కామెంట్స్ పెడుతున్నారు.
ఈ వీడియోలో మొదట కనిపించిన వారిలో ఒకరు తను ఫేమస్ అవడం కోసం ఈ వీడియోను తయారు చేస్తున్నారని, పేలుడు పదార్థం అనుకోకుండా ఎక్కడన్నా లీక్ అయి ఉంటే, అక్కడ పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని అన్నారు.
लगता है केक अब्दुल की फैक्ट्री से मंगवाया था 😂😂. pic.twitter.com/NYVEt42jiD
— Weapon. (@sk465g) February 15, 2025