Bomb Blast: పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలోని మజితా పోలీస్ స్టేషన్‌లో బుధవారం రాత్రి 10:05 గంటలకు భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ అద్దాలు పగిలిపోయాయి. పోలీస్ స్టేషన్ గేటు సమీపంలోని బహిరంగ ప్రదేశంలో పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్ గేట్లను మూసివేశారు, పోలీసులు వెంటనే భద్రతను పెంచారు.
ఇది కూడా చదవండి: Padi Kaushik Reddy: పాడి కౌశిక్‌రెడ్డి అరెస్టు తీవ్ర ఉద్రిక్తం.. పోలీసుల అదుపులో బీఆర్ఎస్ ముఖ్య నేతలు
Bomb Blast: ప్రాథమిక సమాచారం ప్రకారం, పోలీసు స్టేషన్ లోపల హ్యాండ్ గ్రెనేడ్ విసిరారు. అయితే అధికారులు దీనిని ధృవీకరించలేదు. పేలుడు సమాచారం అందిన వెంటనే మజిత డీఎస్పీ జస్పాల్ సింగ్ ధిల్లాన్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో పలువురు పోలీసులు ఉన్నారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం అందలేదు. విషయం తీవ్రతను గమనించిన పంజాబ్ పోలీస్ బోర్డర్ రేంజ్ డీఐజీ సతీందర్ సింగ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.