Bomb Blast at airport

Bomb Blast at Airport: విమానాశ్రయం వెలుపల భారీ పేలుడు.. పెద్ద సంఖ్యలో మృతులు!

Bomb Blast at Airport: పాకిస్థాన్‌లోని కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో అర్థరాత్రి భారీ పేలుడు సంభవించింది. బీబీసీ కథనం ప్రకారం ఈ పేలుడులో ఇద్దరు చైనా పౌరులు మరణించారు. అయితే చైనా మాత్రం భారీగా మరణాలు ఉన్నాయని చెబుతోంది. సింధ్ ప్రావిన్స్‌లోని పవర్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న చైనా ఇంజనీర్ల కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని పేలుడు జరిగినట్లు రాయబార కార్యాలయం తెలిపింది. ఈ దాడికి తామే బాధ్యులమని వేర్పాటువాద బలూచిస్థాన్ నేషనల్ ఆర్మీ ప్రకటించింది.

పేలుడులో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED)ని ఉపయోగించినట్లు సింధ్ ప్రావిన్షియల్ హోం మంత్రి జియా-ఉల్-హసన్ లాంజార్ అనుమానించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు జియో న్యూస్ వెల్లడించింది. క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం జిన్నా ఆసుపత్రిలో చేర్చారు.

Bomb Blast at Airport: ఆదివారం రాత్రి 11 గంటలకు పేలుడు సంభవించిందని పాకిస్థాన్ మీడియా ఏజెన్సీ ఆజ్ న్యూస్ నివేదించింది. కారులో మంటలు వ్యాపించడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాద స్థలంలో భారీగా సైన్యాన్ని మోహరించారు.

విదేశీయులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డారని హోం మంత్రిత్వ శాఖ అధికారులు మీడియాకు తెలిపారు. పేలుడు శబ్ధంతో ఎయిర్‌పోర్టు భవనం కంపించిందని పౌర విమానయాన శాఖలో పనిచేస్తున్న రాహత్ హుస్సేన్ తెలిపారు.

Bomb Blast at Airport: విమానాశ్రయం సమీపంలో అర్థరాత్రి ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వినిపించింది. విమానాశ్రయం సమీపంలో పొగలు కనిపించాయి. విమానాశ్రయం వెలుపల ట్యాంకర్ పేలింది. పలువురు పాకిస్థానీ కార్మికులు మరణించారని చైనా రాయబార కార్యాలయం తెలిపింది. మొత్తం మృతుల సంఖ్య అస్పష్టంగా ఉంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  PM Resign: రాజీనామా చేసిన ప్రధాన మంత్రి .. ఎందుకంటే..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *