The Rajasaab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది రాజాసాబ్’ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హైప్‌ను పెంచింది. షూటింగ్ దాదాపు పూర్తయిన ఈ మూవీలో ఒక స్పెషల్ ఐటెం సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని తెలుస్తోంది. ఈ పాట కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‌ను సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఈ స్పెషల్ నంబర్ కోసం కరీనాకు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.
Also Read: Kannappa: కన్నప్ప సంచలనం.. విష్ణు ఖాతాలో సూపర్ రికార్డ్?
The Rajasaab: ఆమె ఒప్పుకుంటే ఈ పాట సినిమాకు మరో హైలైట్‌గా నిలుస్తుందని భావిస్తున్నారు. సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. కరీనా ఈ ఆఫర్‌ను ఒప్పుకుంటారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.