Bollywood: బాలీవుడ్ సినీ పరిశ్రమపై మరోసారి సంచలన వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ నటుడు హర్ష్ వర్ధన్ కపూర్ తాజాగా బాలీవుడ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. “బాలీవుడ్ ముగిసిపోయింది.. సల్మాన్ ఖాన్ ఇక నటించడం మానేశాడు.. అమీర్ ఖాన్‌కి కూడా సినిమాలు లేవు” అంటూ స్టార్ కిడ్ హర్ష్ వర్ధన్ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Also Read: Prabhas: ‘ఫౌజీ’ డైరెక్టర్ కి ప్రభాస్ మరో బంపర్ ఆఫర్!
Bollywood: సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు బాలీవుడ్‌లో దశాబ్దాలుగా ఓ వెలుగు వెలిగారు. కానీ, ఇప్పుడు వారి కెరీర్‌పై ఇలాంటి కామెంట్స్ రావడం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. హర్ష్ వర్ధన్ కపూర్ వ్యాఖ్యలపై సల్మాన్, అమీర్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇదిలా ఉంటే, బాలీవుడ్‌లో కొత్త తరం హీరోలు ఎదుగుతున్నారని, కానీ పాత తరం హీరోల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి.

