Govinda Injured: బాలీవుడ్ నటుడు గోవిందాకు బుల్లెట్ గాయాలు తగిలాయి. ఈ తెల్లవారుజాము సమయంలోతన గన్ చెక్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ గన్ పేలడంతో గోవిందా కాలులోకి బులెట్ దూసుకుపోయింది. దీంతో గోవిందాకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆయనను కుటుంబసభ్యులు హాస్పిటల్ కు చేర్చారు. అక్కడ డాక్టర్స్ ఆయనకు వైద్యం చేస్తున్నారు. ప్రస్తుతం గోవిందా పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
ఈ తెల్లవారుజామున కోల్ కతా వెళ్ళడానికి గోవిందా తయారు అవుతుండగా ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది . గోవిందా చేతిలో నుంచి గన్ కింద పడటంతో అది పేలింది . దీంతో తూటా అయన కాలులోకి దూసుకుపోయింది చెబుతున్నారు . హాస్పిటల్ కు చేరిన గోవిందకు చికత్స చేసి కాలి లోంచి బులెట్ ను తొలగించారు వైద్యులు
(ఈ వార్త అప్ డేట్ అవుతోంది)

