Bollywood: బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ కొత్త కేసులో చిక్కుకున్నారు. డ్రగ్స్ సంబంధించి కస్టమ్స్ ఆఫీసర్లు ముంబైలోని అంధేరీలోని ఆయన ఆఫీసులో సోదాలు చేశారు. అయితే ముందుగా అజాజ్ ఖాన్ ఆఫీస్ సిబ్బందిని కస్టమ్స్ ఆఫీసర్లు అరెస్టు చేశారు. వారు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆజాజ్ ఖాన్ 100 గ్రాములు ఎండీని ఆర్డర్ చేసినట్టుగా గుర్తించారు.
అయితే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం యూరప్ నుంచి రూ.30 నుంచి రూ.35 లక్షల విలువైన డ్రగ్స్ ను కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. అయితే ముంబైలోని అంధేరీలో వీరంతా ఓ బిల్డిండ్ ను అద్దెకు తీసుకుని, సిబ్బంది నడిపిస్తున్నారు. అయితే డ్రగ్స్ కేసులో అజాజ్ ఖాన్ పేరు బయటకు రావడం కొత్తేమీ కాదు. ఈ కేసులో అరెస్టు చేసిన అజాజ్ ఖాన్ సిబ్బంది సూరజ్ గౌర్ ను బుధవారం కోర్టులో హాజరుపర్చినట్లు తెలుస్తోంది.

