Bank Recruitment

Bank Recruitment: డిగ్రీ పాస్ అయ్యారా.. బ్యాంక్ జాబ్ పక్క

Bank Recruitment: బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో 1267 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల కోసం రిక్రూట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వ్యవసాయం, MSME, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మొదలైన వివిధ రంగాలలో ఈ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. జనవరి 17, 2024లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష, సైకోమెట్రిక్ పరీక్ష ఇంటర్వ్యూ ఉంటాయి. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లోని వివిధ విభాగాల్లో రెగ్యులర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 17వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1267 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు అనుమతించబడ్డాయి. గ్రామీణ  వ్యవసాయ బ్యాంకింగ్, రిటైల్ బాధ్యతలు, MSME బ్యాంకింగ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్, కార్పొరేట్  ఇన్‌స్టిట్యూషనల్ క్రెడిట్, ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రైజ్ డేటా మేనేజ్‌మెంట్ ఆఫీస్‌లో ఈ పోస్టులు భర్తీ చేయబడతాయి.

పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.

అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఆఫీసర్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ మేనేజర్, మేనేజర్ – సేల్స్, మేనేజర్ – క్రెడిట్ అనలిస్ట్, సీనియర్ మేనేజర్ – క్రెడిట్ అనలిస్ట్, సీనియర్ మేనేజర్ – MSME రిలేషన్, హెడ్ – SME సెల్, ఆఫీసర్ – సెక్యూరిటీ అనలిస్ట్, మేనేజర్ – సెక్యూరిటీ అనలిస్ట్, సెక్యూరిటీ – సీనియర్ టెక్నికల్, ఆఫీసర్ సివిల్ ఇంజనీర్, టెక్నికల్ మేనేజర్- సివిల్ ఇంజనీర్, టెక్నికల్ సీనియర్ మేనేజర్- సివిల్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, టెక్నికల్ మేనేజర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, టెక్నికల్ సీనియర్ మేనేజర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, టెక్నికల్ మేనేజర్ ఆర్కిటెక్ట్, సీనియర్ మేనేజర్ – C&IC రిలేషన్షిప్ మేనేజర్, సీనియర్ మేనేజర్ – C&IC క్రెడిట్ అనలిస్ట్ మొదలైనవి.

ఇది కూడా చదవండి: High Court: హైకోర్టు ప్రధాన న్యాయ‌మూర్తిగా సుజ‌య్‌పాల్‌

విద్యా అర్హత:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గ్రాడ్యుయేషన్, పీజీ డిగ్రీ, డిప్లొమా, పీహెచ్‌డీ, సీఏ/ సీఎంఏ/ సీఎస్/ సీఎఫ్‌ఏ లేదా సంబంధిత విభాగాల్లో పాస్ ఐ ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పనిచేసిన అనుభవం ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 17 చివరి తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము జనరల్/EWS/OBC అభ్యర్థులకు రూ.600  SC/ST/వికలాంగులు/మహిళల అభ్యర్థులకు రూ.100. ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ మొదలైన వాటి ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ALSO READ  Tesla: 27 లక్షల కార్ కి.. 33 లక్షల పన్ను.. పన్ను దోపిడీ అంటున్న నెటిజన్లు

వ్రాత పరీక్ష విధానం:

రీజనింగ్ విభాగంలో 25 ప్రశ్నలకు 25 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగంలో 25 ప్రశ్నలకు 25 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగంలో 25 ప్రశ్నలకు 25 మార్కులు, ప్రొఫెషనల్ నాలెడ్జ్ విభాగంలో 75 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. మొత్తం ప్రశ్నల సంఖ్య 150. పరీక్ష 150 నిమిషాల్లో 225 మార్కులకు జరుగుతుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *