Bob Simpson:ఆస్ట్రేలియా క్రికెట్ రంగంలో విషాదం అలుముకున్నది. ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కోచ్ బాబ్ సింప్సన్ (89) ఈ రోజు (ఆగస్టు 16) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు అనారోగ్య సమస్యలు తోడయ్యాయి. ఆయా సమస్యలతో ఆయన శనివారం తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో ఆదేశ క్రికెట్ పెద్ద దిక్కును కోల్పోయినట్టయింది.
Bob Simpson:1957లో దక్షిణాఫ్రికాపై టెస్ట్ మ్యాచ్ ద్వారా బాబ్ సింప్సన్ అంతర్జాతీయ క్రికెట్ రంగంలో అడుగు పెట్టారు. బాబ్ సింప్సన్ 62 టెస్టుల్లో 46.8 సగటుతో 4869 పరుగులు చేశాడు. వీటిలో 10 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రెండు వన్డేలే ఆడియన ఆయన 18 సగటుతో 36 పరుగులు చేశాడు.
Bob Simpson:1977లో వరల్డ్ సరీస్ క్రికెట్ సంక్షోభ సమయంలో ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా బాబ్ సింప్సన్ నాయకత్వ బాధ్యతలు స్వీకరించారు. ఆ జట్టను బలంగా తీర్చిదిద్దడంలో ఆయన కెప్టెన్సీ ఎంతో ఉపయోగపడింది. క్రికెట్ నుంచి రిటైరయ్యాక 1986 నుంచి 1996 మధ్య ఆస్ట్రేలియా జట్టకు కోచ్‌గానూ ఆయన సేవలందించారు. ఆయన కోచ్‌గా ఉన్నప్పుడే 1987లో వన్డే ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకున్నది.