Bandla Ganesh: టాలీవుడ్లో ‘బ్లాక్‌బస్టర్ ప్రొడ్యూసర్’గా పేరుగాంచిన బండ్ల గణేష్, మళ్లీ సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ‘గబ్బర్ సింగ్’, ‘టెంపర్’ వంటి సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన ఆయన, కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. తాజాగా తన రీఎంట్రీపై సంచలన ప్రకటన చేశారు, తాను ఫ్లాప్ కారణంగా కాదని, బ్లాక్‌బస్టర్ విజయం తర్వాతే విరామం తీసుకున్నానని స్పష్టం చేశారు.
నిర్మాత రీఎంట్రీ: తాజాగా జరిగిన ‘తెలుసు కదా’ అనే సినిమా అప్రిసియేషన్ మీట్లో పాల్గొన్న బండ్ల గణేష్, తన సెకండ్ ఇన్నింగ్స్‌ను అధికారికంగా ప్రకటించారు. తాను మళ్లీ సినిమాలు తీయమని తన సోదరుడు, నిర్మాత ఎస్కేఎన్ సూచించారని తెలిపారు. తాను ఏ డిజాస్టర్ (అపజయం) తర్వాత నిర్మాణాన్ని ఆపలేదని, 2015లో వచ్చిన ‘టెంపర్’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తీసిన తర్వాతే కొంతకాలం సినిమాల నుండి దూరంగా ఉన్నానని ఆయన వివరించారు.
Also Read: Tollywood: చిరంజీవి సినిమాలో విక్టరీ వెంకటేశ్
గతంలో తన పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్’, ఎన్టీఆర్‌తో ‘బాద్షా’, ‘టెంపర్’, రామ్ చరణ్‌తో ‘గోవిందుడు అందరివాడేలే’, అల్లు అర్జున్‌తో ‘ఇద్దరమ్మాయిలతో’ వంటి భారీ చిత్రాలు నిర్మించి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించారు. దీంతో టాలీవుడ్లో ఆయన పేరు ఒక బ్రాండ్‌గా మారింది.
“త్వరలోనే మరో భారీ ప్రాజెక్ట్‌తో రీఎంట్రీ ఇస్తా, పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్‌పై మళ్లీ బ్లాక్‌బస్టర్ సినిమా తీస్తా” అని ఆయన స్పష్టం చేశారు. ఆయన కొత్త కథలతో సినీ రంగంలోకి రావడం పట్ల అభిమానుల్లో, సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. బండ్ల గణేష్ ఈసారి ఎలాంటి కథలతో ప్రేక్షకులను మెప్పించనున్నారో చూడాలని టాలీవుడ్ ఎదురుచూస్తోంది.

