Punjab: పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో పెట్రోల్ పంపు ఓనర్ కి వాట్సాప్ లో ఒక మెసేజ్ వచ్చింది. దానిలో తమకు 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని.. లేకపోతే పెట్రలో పంపును పేల్చేస్తామని బెదిరించారు. ఆ వెంటనే పెట్రోల్ పంప్ ముందు ఉన్న డ్రెయిన్‌లో పేలుడు జరిగింది. పెట్రోలు పంప్‌లో పనిచేస్తున్న సిబ్బంది యజమాని ఖుష్వీందర్ సింగ్ కు ఈ విషయం తెలిపారు. పేలుడు సంఘటన సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ప్రాథమిక విచారణలో, పెట్రోల్ పంప్ ముందు బాంబు తో పేలుడు సృష్టించారు నేరగాళ్లు. ఈ సంఘటన తర్వాత పేలుడుకు బాధ్యత వహిస్తూ పెట్రోల్ పంప్ యజమానికి వాట్సాప్‌లో ఓ ఫారిన్ నంబర్ ద్వారా మెసేజ్, మిస్డ్ కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
