Pakistan Army

Pakistan Army: పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. ఆర్మీ వాహనాన్నిపేల్చేసిన BLA.. 10 మంది సైనికులు హతం

Pakistan Army: భారత్‌తో యుద్ధం అంటూ రెచ్చిపోతున్న పాకిస్తాన్‌కు తన ఇంట్లోనే పెద్ద ముప్పు ఎదురైంది. బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (BLA) చేపట్టిన సమీకృత దాడుల్లో పది మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. మార్గట్ ప్రాంతంలో రహదారి పక్కన రహస్యంగా అమర్చిన బాంబును రిమోట్ కంట్రోల్‌తో పేల్చి దాడి జరిపిన బీఎల్‌ఏ, అనంతరం దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దాడి అనంతరం విడుదల చేసిన ప్రకటనలో బలూచ్ యోధులు, “ఇది కేవలం ప్రారంభం మాత్రమే. పాక్ సైన్యానికి ఇక భద్రత అనే మాట ఉండదని” హెచ్చరించారు. తమ హక్కుల కోసం చివరి వరకూ పోరాడతామని, ఈ దాడులు కొనసాగుతాయని ఘాటుగా హెచ్చరించారు. గత మార్చిలో కూడా బలూచిస్తాన్‌లో జరిగిన భారీ దాడిలో 60 మందికి పైగా పాక్ సైనికులు హతమయ్యారు. ఇప్పుడు తాజాగా మరోసారి పాక్ ఆర్మీపై భారీ దాడి చేసి బీఎల్‌ఏ తన బలాన్ని ప్రదర్శించింది.

ఇది కూడా చదవండి: Hydra Commissioner:హైద‌రాబాద్‌లో బీఆర్ఎస్ పోస్ట‌ర్ల చించివేత క‌ల‌క‌లం.. హైడ్రా సిబ్బందిపై బీఆర్ఎస్ నేత‌ల ఫైర్‌.. రంగ‌నాథ్ స్పంద‌న‌

ఇక గురువారం జరిగిన మరో ఘటనలో 7 మంది పాక్ సైనికులు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ దాడులు పాక్ ప్రభుత్వాన్ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాయి. గతంలో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసిన ఘటనను కూడా మరిచిపోలేం.

ఇక పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం బలూచిస్తాన్‌లో జరుగుతున్న వీర విప్లవం ఎదుర్కొనేందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. భారత్‌పై మాత్రం ధైర్యం చూపిస్తున్నట్టు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న పాక్‌, బలూచ్ యోధుల దాడుల ముందు చేతులెత్తేసినట్టుగా కనిపిస్తోంది.

అవలంభిస్తున్న ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ సైన్యం దేశమంతటా అలెర్ట్‌లోకి వెళ్లింది. భారత్‌తో యుద్ధం వేళ, మరోవైపు ఆఫ్గనిస్తాన్, బలూచిస్తాన్ నుంచి ఎదురవుతున్న దాడులతో పాక్ తీవ్ర ఇబ్బందుల్లో పడుతోంది.

తాజా దాడులు పాక్ భద్రతా వ్యవస్థపై తీవ్ర అవమానాన్ని మోపుతున్నాయి. మరోవైపు ప్రజల్లో భయం పెరుగుతోంది. బలూచ్ యోధులు మాత్రం తమ లక్ష్యం పూర్తయ్యేంతవరకూ పోరాటాన్ని మరింత ముమ్మరం చేయాలని సంకల్పించారు.

ALSO READ  లెబనాన్‌తో వార్.. 8మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *