BJP Telangana: బీజేపీ శ్రేణులు.. రాష్ట్ర రాజకీయ వర్గాలు.. ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నిక జూలై 1న జరగనున్నది. ఈ మేరకు జూన్ 29న నోటిఫికేషన్‌ను విడుదల చేస్తండగా. జూన్ 30న నామినేషన్లను స్వీకరించనున్నారు. అయితే ఈ దశలో ఇప్పటి వరకు రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వగా, అదే కిషన్‌రెడ్డికి కేంద్ర క్యాబినెట్ హోదా మంత్రిగా అవకాశం దక్కింది. మరో సహాయ మంత్రిగా మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు అవకాశం వచ్చింది.
BJP Telangana: ఈ నేపథ్యంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ ఆదివారం (జూన్ 29న) బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ ఎన్నిక నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి అభయ్ పాటిల్ ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నారు. కేంద్ర మంత్రి శోభ కర్లందాజే ఆదివారం చేరుకుంటారు. మంత్రి శోభ కర్లందాజే అధ్యక్ష పదవికి అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. జూలై 1న అధ్యక్ష పదవికి ఎన్నికైన అభ్యర్థి పేరును ప్రకటిస్తారు.
BJP Telangana: ఈ మేరకు అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనే ఓటర్ల జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారి యెండల లక్ష్మీనారాయణ విడుదల చేస్తారు. వీరు అధ్యక్ష పదవికి ఏకగ్రీవ ఎన్నిక కాకుంటే, అవసరం అని అనుకుంటే ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ ఓటింగ్‌లో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఉంటారు. రాష్ట్ర పదాధికారులు కూడా సభ్యులుగా ఉంటారు. అయితే అధ్యక్ష పదవితో పాటు ఇదే ఎన్నికల్లో లోక్‌సభ నియోజకవర్గానికి ఒకరు చొప్పున జాతీయ కౌన్సిల్ సభ్యులను ఎన్నుకుంటారు.
BJP Telangana: ఈ దశలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఈ సారి బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు కీలకంగా భావించే మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరే ప్రముఖంగా వినిపిస్తుండగా, మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పేరు కూడా అధ్యక్ష పదవికి పోటీ పడతారని భావిస్తున్నారు. అదే విధంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా బీసీ కోటాలో పోటీ పడుతున్నారని తెలిసింది. ఒకవేళ మహిళా కోటాలో అయితే మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణకే ఆ అవకాశం దక్కుతుందని అందరూ భావిస్తున్నారు.