BJP MP Laxman: ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాలపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయా కుటుంబాల్లో వైఎస్సార్, కేసీఆర్‌లు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు అడ్డగోలుగా ఆస్తులు కూడబెట్టుకున్నారని ఆరోపించారు. అధికారం కోల్పోగానే ఇప్పుడు ఆస్తులు, పదవుల పంపకాల్లో తేడాలు రావడంతో వారి కుటుంబ సభ్యులు రోడ్డుకెక్కారని ఆరోపించారు.
BJP MP Laxman: ఒకప్పుడు అన్నల కోసం, వదినల కోసం వదిలిన బాణాలు.. ఇప్పుడు అన్నలపైనే ఎక్కుపెట్టే పరిస్థితి వచ్చిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ప్రజల అవసరాల కంటే తమ కుటుంబ అవసరాలు, వారసత్వమే ముఖ్యమన్నట్టుగా ఈ రెండు కుటుంబాలు తెలుగు రాష్ట్రాల్లో వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. నిన్న వైఎస్సార్ కుటుంబం, నేడు కేసీఆర్ కుటుంబాలు అదే రీతిన వీధులకెక్కి రచ్చ చేస్తున్నాయని ఆరోపించారు.
BJP MP Laxman: ఆ రెండు కుటుంబాల వెనుక కాంగ్రెస్ నాయకత్వమే ఉన్నదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబంలో ఆయన కూతురు కవిత కుట్రలకు దిగుతున్నారని, ఆమె కుట్రలు పనిచేయవని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ ఎలా బయటకు వచ్చిందని ప్రశ్నించారు. కేటీఆర్ నాయకత్వాన్ని కవిత వ్యతిరేకిస్తున్నందునే ఆమె లేఖ రాశారని తెలిపారు.
BJP MP Laxman: పదేళ్లుగా సామాజిక న్యాయం గురించి మాట్లాడని కవిత ఇప్పుడే ఎలా మాట్లాడుతారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందనే కవితతో కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోందని ఆరోపించారు. షర్మిలను కూడా కాంగ్రెస్ పార్టీ ఇలాగే వాడుకున్నదని వ్యాఖ్యానించారు.