Rama rao: బీజేపీ ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంచలన ప్రకటన చేశారు. ఆలయ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే గర్భాలయంలోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు.
శనివారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన నిర్వహించిన బాసర ఆలయ అభివృద్ధి కమిటీ సమావేశంలో రామారావు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రూపాయి నిధి కూడా ఆలయ అభివృద్ధికి విడుదల చేయలేదని మండిపడ్డారు.
“నిధులు ఇవ్వకపోతే నేను బిచ్ఛం ఎత్తుకొని అయినా బాసర ఆలయాన్ని అభివృద్ధి చేస్తాను. దీపావళి వరకు గడువు ఇస్తున్నాను. అప్పటికీ నిధులు రాకపోతే ఆలయం గర్భగుడిలోనే నిరాహార దీక్ష చేస్తా,” అంటూ ఘాటుగా హెచ్చరించారు.
ఇక ప్రభుత్వం హామీలను కాదనకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని, దేవస్థానం అభివృద్ధిని రాజకీయ ప్రయోజనాలకు వదలకూడదని ఆయన స్పష్టం చేశారు.