Crime News: బీహార్‌లోని గయా జిల్లాలో ఓ విచిత్రం, షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఎంత దారుణ పరిణామాలకు దారితీస్తాయో చెప్పే ఈ సంఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది.
చిన్న గొడవే పెద్ద దారుణానికి దారితీసింది
ఖిజ్రాసరాయ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసించే ఓ దంపతుల మధ్య చిన్న గొడవ తలెత్తింది. మాటామాటా పెరిగి ఘర్షణగా మారింది. ఆగ్రహంతో ఊగిపోయిన భార్య, గొడవలో భర్తపై దాడి చేసి.. భర్త నాలుకను కొరికి, కరకర నమిలి మింగేసింది.
ఈ దారుణ ఘటనతో భర్తకు తీవ్రమైన రక్తస్రావం జరిగింది. రక్తం ఎక్కువగా పోవడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు, గ్రామస్థులు వెంటనే అతన్ని సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో కూడా గొడవే
డాక్టర్ మీనారాణి ప్రకారం, భర్త ఆరోగ్యం విషమించడంతో మగధ్ వైద్య కళాశాలకు తరలించామని తెలిపారు. కానీ, షాకింగ్ విషయమేమిటంటే, ఆస్పత్రిలోకే చేరాక కూడా భార్యాభర్తల మధ్య గొడవ ఆగలేదని గ్రామస్థులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Rajeev Kanakala: సినీ నటుడు రాజీవ్ కనకాలకు పోలీసుల నోటీసులు..
పోలీసులు ఏమంటున్నారు?
ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.
కుటుంబాలు చెదరగొట్టే గొడవలు
ఇలాంటి ఘటనలు ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి. చిన్న గొడవలే పెద్ద దారుణాలకు దారితీస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్య హింస, వివాహేతర సంబంధాల కారణంగా ప్రాణాలకు తెగబడే ఘటనలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి గొడవలు కుటుంబాలను చిన్నాభిన్నం చేయడంతోపాటు పిల్లలను అనాథలుగా మారుస్తున్నాయి.