Bird flu: ఈ జిల్లా వాళ్లు చికెన్ తినకండి.. అధికారుల వార్నింగ్..

Bird flu: తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద సంఖ్యలో కోళ్లు మృతిచెందడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు, కోళ్ల మరణాలకు బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్‍ఫ్లుయెంజా) కారణమని నిర్ధారణ చేశారు. దీంతో ప్రజలు కొంతకాలం చికెన్‌ను మానుకోవాలని సూచించారు.

శాంపిల్స్ పరీక్షలో బర్డ్ ఫ్లూ పాజిటివ్

జిల్లాలోని పలు కోళ్లఫారాల నుంచి శాంపిల్స్ సేకరించిన అధికారులు, కానూరు గ్రామంలోని ఫారంలో బర్డ్ ఫ్లూ ఉన్నట్లు గుర్తించారు. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను అప్రమత్తం చేశారు.

అధికారుల చర్యలు

బర్డ్ ఫ్లూ ప్రబలుతున్న నేపథ్యంలో జిల్లా అధికారులు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఆరోగ్య సమస్యలు లేదా కోళ్ల మరణాలపై సమాచారం అందించేందుకు 9542908025 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.ప్రజలు అవసరమైనంత వరకు చికెన్ తినడం తగ్గించుకోవడం మంచిదని, జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *