Bihar:ఎవరైనా కాంట్రాక్టర్ రోడ్డు విస్తరణ చేపడితే.. పక్కనున్న చెట్లను తొలగిస్తారు.. గుట్టలను తొలిచేస్తారు.. రోడ్డును చదును చేసి రోలర్‌తో చదును చేసి కొత్తరోడ్డు వేస్తారు.. కానీ, ఇక్కడి దీనికి విరుద్ధంగా జరిగింది. నడిరోడ్డుపైన ఉన్న చెట్లను వదిలేసిన కాంట్రాక్టర్ రోడ్డు పరిచేశాడు. ఇదేమి వైపరీత్యం.. అనుకుంటూ ముక్కున వేలేసుకోవడం వాహనదారులు, బాటసారుల వంతయింది. ఇది బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకున్నది.
Bihar:బీహార్ రాష్ట్రంలోని పాట్నా-గయా ప్రధాన ప్రధాన రోడ్డు విస్తరణ పనులను అధికారులు చేపట్టారు. 7.48 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు విస్తరణ కోసం రూ.100 కోట్లు కేటాయించారు. రోడ్డు మధ్యలో ఉండే జహానాబాద్ వద్ద రోడ్డు మధ్యలో ఏండ్లనాటి చెట్లు అడ్డుగా ఉన్నాయి. వాటిని తొలగించేందుకు సంబంధిత అధికారులు.. అటవీశాఖను అనుమతి కోరారు.
Bihar:ఆ చెట్ల తొలగింపునకు అటవీశాఖ నిరాకరించింది. దీనికి ప్రతిగా 14 హెక్టార్ల భూమిని అటవీశాఖకు పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇది రోడ్డు రవాణా శాఖ అధికారులకు కోపం తెప్పించిందో.. ఏమో కానీ, కనీసం ఆ సమస్య పరిష్కారానికి ఇక చొరవ తీసుకోలేదు. ఏకంగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ఎలాగంటే చెట్లను తొలగించకుండానే వాటి చుట్టూ తారు రోడ్డు వేసేశారు.
Bihar:ఇదన్నమాట మ్యాటర్. మరి వచ్చే వాహనాలు ఎలా వెళ్లాలి, రోడ్డు వేసి ఏం లాభమో వారే చెప్పాలి. కాంట్రాక్టర్‌కు బిల్లు రావాలి, పనులు పూర్తి చేసి తమ బాధ్యతను నెరవేర్చాలన్న ఆతృతతోనే ఆ రోడ్డు వేశారని ప్రజలు అభ్యంతరాలను వ్యక్తంచేస్తున్నారు. మరింత చొరవ తీసుకొని, కొంత స్థలాన్నైనా అటవీ శాఖకు ఇచ్చి ఉంటే ఒప్పుకునేవారేమోనని చెప్తున్నారు.