Bihar: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఓటమి గల కారణాలపై విశ్లేషించింది. ఆర్జేడీ, వామపక్ష పార్టీలతో కలిసి కాంగ్రెస్ మహాగఠ్ బంధన్ కూమిటిగా బరిలోకి దిగింది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 61 స్థానాల్లో పోటీ చేయగా, కేవలం ఆరు స్థానాల్లో విజయం సాధించింది. మిగతా చోట్ల ఘోర ఓటమిని చవిచూసింది. ఆయా స్థానాల్లో ఓటమి, దానికి గల కారణాలను విశ్లేషించింది.
Bihar: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణమయ్యారన్న ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీ ఏడుగురు నాయకులను గుర్తించింది. ఆ ఏడుగురు నేతలను పార్టీ నుంచి ఆరు సంవత్సరాల పాటు సస్పెండ్ చేస్తూ బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయం తీసుకున్నది. వారంతా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, క్రమశిక్షణను ఉల్లంఘించారని నిర్ధారించింది.
Bihar: ఈ మేరకు బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అనుబంధమైన కాంగ్రెస్ సేవాదళ్ మాజీ ఉపాధ్యక్షుడు ఆదిత్య పాశ్వాన్, బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు షకీలూర్ రెహమాన్, కిసాన్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాజ్‌కుమార్ శర్మ, రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాజ్‌కుమార్ రాజన్, బీసీ శాఖ మాజీ అధ్యక్షుడు కుందన్ గుప్తా, బంకాజిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కాంచన కుమారి, నలంద జిల్లా నుంచి రవి గోల్డెన్‌ను సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది.
Bihar: ఎన్నికల్లో ఓటమికి కారకులైన సీనియర్ నాయకులపై చర్యలు తీసుకోకుండా, వారిని కాపాడేందుకే ఈ ఏడుగురిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసిందని మరో వర్గం ఆరోపణలు గుప్పించింది. ఏదేమైనా బీహార్ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలతోనే బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ చర్యలకు ఉపక్రమించిందని అంటున్నారు.
