Bigg Boss 9 Telugu

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజ‌న్‌9లో ఊహించ‌ని ట్విస్ట్.. మిడ్ వీక్‌లో ఎలిమినేష‌న్.. బయటకు వెళ్లేది ఎవరంటే?

Bigg Boss 9 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకి చేరుకుంది. దింతో కాంటెస్ట్‌లా మధ్య హోరాహోరీ పోటీ నడుస్తుంది. సెప్టెంబర్ 7న స్టార్ట్ అయిన బిగ్ బాస్ ఇంకా కొన్ని రోజులో ముగియనుంది. నెక్స్ట్ వచ్చేది గ్రాండ్ ఫినాలే వీక్. హౌస్ లో ఇంకా 7 మంది కాంటెస్ట్ లు ఉన్నారు కానీ బిగ్ బాస్ టీం లాస్ట్ వీక్ లో 5 మంది కంటెస్టెం    ట్స్ తో గ్రాండ్ ఫినాలే ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

హౌస్ లో తనూజ, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, సంజనా గల్రానీ, డిమాన్ పవన్, సుమన్ శెట్టి, భరణి ఉన్నారు. ఈ వారం వీరిలో ఇద్దరిని ఎలిమినేట్ చేయనున్నారు అంటూ సమాచారం. ఇందుకోసం మిడ్ వీక్ ఎలిమినేట్ లో ఒక్కరిని సన్ డే ఇంకొకరిని హౌస్ నుండి బయటికి పంపియడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ వారం ఎలిమినేషన్స్ కు సంబంధించి పడాల కల్యాణ్ మినహా మిగతా ఆరు మంది నామినేష‌న్స్‌లో ఉన్నారు.

ఒకవేలా ఇదే నిజమైతే ఎవరు ఎలిమినేట్ అవడానికి ఎక్కువ అవకాశం ఉందొ చూద్దాం. బిగ్ బాస్ స్టార్టింగ్ నుండి ప్రతి ఓటింగ్ లో టాప్ ప్లేస్ లో తనూజనే ఉంటుంది. ఇపుడు కూడా ఆమె టాప్ ప్లేస్ లో ఉంది. రెండో స్థానంలో ఇమ్మాన్యుయేల్, మూడో స్థానంలో డిమాన్ పవన్, నాలుగో స్తానంలో భరణి, ఐదో స్తానం లో సంజనా ఉన్నారు.ఓటింగ్ లో చివరి స్థానంలో ఉంది సుమన్ శెట్టి ఉన్నారు. చివరి రెండు స్థానాల్లో ఉన్న సంజనా, సుమన్ శెట్టి మధ్యలోనే ఎలిమినేషన్ ఉంటుంది. లాస్ట్ మినట్ లో ఏదైనా జరగొచ్చు ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం సుమన్ శెట్టి హౌస్ నుండి బయటికి వేలే అవకాశం ఎక్కువగా ఉంది. సంజనకు ఓట్లు బాగానే వస్తున్న బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లలో అంత యాక్టీవ్ గా లేరు. మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుతే గురువారం అంటే ఈరోజు జరగాలి లేదా వీక్ లాస్ట్ లో ఇద్దరిని ఎలిమినేట్ చేస్తారా అన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు, మరికొన్ని గంటలో దీనిపైనా ఓ క్లారీటీ రానుంది.

ఇదే విషయంపైనా ఇంకో వార్త కూడా వినిపిస్తుంది. ఈ వీక్ ఒక్కరినే ఎలిమినేట్ చేసి మిగిలిన 6మందిని ఫైనల్ వీక్ కి పంపించనుంది. ఆ వీక్ మధ్యలో ఎలిమినేట్ లేక ఫినాలేకి ముందురోజు ఎలిమినేషన్ చేసే అవకాశం ఉంటుంది, మిగిలిన 6మందిని ఫినాలేకి తీసుకొచ్చి అదే రోజు ఒక్కరొక్కరుగా ఎలిమినేట్ చేసి  చివరికి బిగ్ బాస్ 9 తెలుగు విజేతను ప్రకటిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *