Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రెండో రోజు ప్రొమేని విడుదల చేశారు. ఇందులో చుస్తే హౌస్‌లో హీట్ మామూలుగా లేదు. ఓనర్స్, టెనెంట్స్‌గా రెండు గ్రూపులుగా ఉన్న కంటెస్టెంట్స్ మధ్య మాటల ఘర్షణలు, వ్యూహాలు మొదలైపోయాయి అని తెలుస్తుంది. తొలి నామినేషన్స్ రౌండ్‌ను బిగ్ బాస్ కాస్త ట్విస్ట్‌తోనే ప్రారంభించాడు.
సంజనపై ఫోకస్!
సామాన్యులు (ఓనర్స్) ఈ వారం నామినేట్ చేసే పవర్‌ను సొంతం చేసుకున్నారు. అందరూ ఏకాభిప్రాయంతో కిచెన్ వర్క్ చేస్తూ ఉన్న సంజన గల్రానీను టార్గెట్ చేశారు. “రూల్స్ ఫాలో కావడం లేదు, అబద్ధాలు చెబుతోంది, గాసిప్స్ స్ప్రెడ్ చేస్తోంది” అంటూ ఓనర్స్‌లోని మనీష్ కారణాలు చెప్పాడు.
ఇది కూడా చదవండి: Revanth Reddy: సీఎం ఇల్లు కూల్చివేత.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఏంటంటే ?
ఈ నిర్ణయం పట్ల సంజన కాస్త ఎమోషనల్ అవ్వడంతో హౌస్‌లో హీట్ పెరిగింది. ఆషా షైనీ కూడా సంజనపై ఫైర్ అయ్యింది. తన వ్యక్తిగత రిలేషన్‌షిప్ గురించి పదేపదే హౌస్‌లో చర్చించడం నచ్చలేదంటూ భావోద్వేగంగా స్పందించింది ఆమె.తనని టార్గెట్ చేస్తూ ఇలాంటి విషయాలు పదే పాదే మాట్లాడుతున్నారు అన్నారు. ఇలా చేయడంతో మానసికంగా కుంగిపోయి గేమ్ లో సరిగా ఇన్వాల్వ్ కాలేరు అని భావిస్తున్నారు.
మొత్తం 9 మంది నామినేట్
సామాన్యులు ఈ వారం సెలబ్రిటీలను ఒక్కొక్కరుగా నామినేట్ చేశారు. చివర్లో సెలబ్రిటీలు కూడా ఒక కామనర్‌ను నేరుగా నామినేట్ చేయడంతో మొత్తం తొమ్మిది మంది లిస్ట్‌లో చేరారు:
-
సంజనా గల్రానీ
-
రీతూ చౌదరి
-
ఫ్లోరా షైనీ
-
శ్రష్ఠి వర్మ
-
ఇమ్మానుయేల్
-
తనూజ
-
రాము రాథోడ్
-
సుమన్ శెట్టి
-
డీమన్ పవన్
ఇక సెలబ్రిటీలలో భరణి శంకర్ను సేవ్ చేసే అవకాశం ఇవ్వడంతో ఆయన నామినేషన్ నుంచి తప్పించుకున్నారు.
ఎలిమినేషన్ రేసులో ఎవరు?
హౌస్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఎలిమినేషన్‌నే. సంజన గల్రానీ, సుమన్ శెట్టి, ఫ్లోరా షైనీ ముగ్గురు కఠిన పోటీలో ఉన్నారు. ఫ్లోరా షైనీ (లక్స్ పాప) ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.