Duvvada Srinivas

Duvvada Srinivas: మాధురికి ఈ అనుభవం రావాలి.. ఇంకోసారి పిలిస్తే బిగ్ బాస్ కి వెళ్తాను..

Duvvada Srinivas: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఇప్పుడు నిజంగానే హీట్ పెరిగిపోయింది. ఆదివారం జరిగిన స్పెషల్ ఎపిసోడ్‌తో వైల్డ్ కార్డ్ ఎంట్రీల సునామీనే వచ్చింది. మొత్తం ఆరుగురు కొత్త కంటెస్టెంట్లు ఒకేసారి హౌస్‌లోకి అడుగుపెట్టడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

కొత్తగా ఎంట్రీ ఇచ్చిన వారిలో అలేఖ్య, చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష, టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనివాస్ సాయి, దివ్వల మాధురి, సీరియల్ నటుడు నిఖిల్ నాయర్, సీరియల్ నటి ఆయేషా జీనత్, సీరియల్ నటుడు గౌరవ్ గుప్తా ఉన్నారు. వీరంతా హౌస్‌లోకి అడుగుపెట్టిన వెంటనే మాటల తూటాలు, టాస్కుల హంగామా మొదలైంది.

ఇక మాధురికి బయట నుంచి దువ్వాడ శ్రీనివాస్ బలంగా మద్దతు ఇస్తున్నారు. వరుసగా వీడియోలు రిలీజ్ చేస్తూ ఆమెకు సపోర్ట్‌గా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. తాజాగా ఆయన ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ ఆఫర్, మాధురితో తన రిలేషన్‌షిప్‌ వంటి విషయాలపై స్పష్టంగా మాట్లాడారు.

ఇది కూడా చదవండి: Donald Trump: మోడీని నా మిత్రుడు.. పాక్ పీఎం ముందే మోదీని పొగిడిన ట్రంప్‌

“బిగ్ బాస్ ఎలా కండక్ట్ అవుతుందో నాకు అసలు తెలియదు. మొదట బిగ్ బాస్ టీమ్ మా ఇద్దరినీ కలిసి రావాలని అడిగింది. కానీ నాకు బయట చాలా బిజినెస్‌లు ఉండటంతో కుదరలేదు. అందుకే మాధురిని పంపించా. ఆమెకు ఈ అనుభవం రావాలి. ఒక మహిళగా మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. భవిష్యత్‌లో బిగ్ బాస్ పిలిస్తే ఆలోచిస్తాను” అని దువ్వాడ వెల్లడించారు.

దీంతో నెటిజన్లలో చర్చ మొదలైంది “దువ్వాడ తర్వాత బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అవుతారా?” అనే ప్రశ్న సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇక మాధురి హౌస్‌లో చేసే గేమ్, దువ్వాడ బయట ఇచ్చే సపోర్ట్‌ ఈ జంట చుట్టూ వచ్చే రోజుల్లో మరింత ఆసక్తికరమైన డ్రామా జరగనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *