Bigg Boss 9

Bigg Boss 9: బిగ్ బాస్ హౌస్ నుంచి ఆయేషా ఔట్..!

Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్‌లోకి అడుగుపెట్టి ‘ఫైర్ బ్రాండ్’ ఇమేజ్ సంపాదించుకున్న నటి ఆయేషా జీనత్, అనూహ్యంగా హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె ఆట మధ్యలోనే నిష్క్రమించాల్సి వచ్చింది.

టైఫాయిడ్, డెంగ్యూతో నిష్క్రమణ
ఆయేషా హౌస్‌లోకి వచ్చిన రెండో వారం నుంచే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతోంది. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు ఉండటంతో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆమెకు టైఫాయిడ్, డెంగ్యూ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

డాక్టర్లు ఈ విషయాన్ని ధృవీకరించిన తర్వాత, బిగ్ బాస్ ఆమెను కన్ఫెషన్ రూమ్‌కి పిలిచారు. “మీరు త్వరగా కోలుకోవడానికి, అలాగే ఇతర ఇంటి సభ్యుల ఆరోగ్య భద్రత దృష్ట్యా వైద్య నిపుణుల పర్యవేక్షణ అవసరం. అందుకే మిమ్మల్ని హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి అనుమతి ఇస్తున్నాం” అని బిగ్ బాస్ తెలిపారు. దీంతో ఆయేషా కన్నీళ్లు పెట్టుకుంటూ హౌస్‌కు వీడ్కోలు పలికింది.

బయటకు వెళ్లే ముందు, తన సన్నిహితుడు రాము రాథోడ్ వద్ద ఆయేషా తన బాధను పంచుకుంది. “నా జీవితంలో నేను దేన్ని ఎక్కువగా ప్రేమిస్తానో అది నాతో ఉండదు. నాకు ఏదీ అంత ఈజీగా రాలేదు. బిగ్ బాస్ రెండో అవకాశం ఇచ్చినా, అది కూడా ఇలా చేజారిపోయింది” అంటూ ఎమోషనల్ అయ్యింది.

Also Read: Samantha: ఎదురుదెబ్బలపై సామ్ షాకింగ్ కామెంట్స్!

హౌస్‌మేట్స్‌కు సలహా
హౌస్‌ను వీడే ముందు ఆయేషా తనూజకు ప్రత్యేకంగా సలహా ఇచ్చింది. “తనూజా, జాగ్రత్త. మళ్లీ ఫేక్ దానిలో పడొద్దు. ఇదొక్కటే చెబుతున్నాను” అంటూ వారి మధ్య ఉన్న బంధాల గురించి పరోక్షంగా హెచ్చరించింది. అయితే, ఆయేషా నిష్క్రమణతో ఆమెతో విభేదాలు ఉన్న రీతూ చౌదరి సంతోషపడింది.

తమిళ బిగ్ బాస్‌లోనూ వివాదాస్పద కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న ఆయేషా, తెలుగులో అడుగుపెట్టగానే రీతూ, తనూజ బంధాలపై వ్యాఖ్యలు చేసింది. నామినేషన్లు, టాస్కుల సమయంలో బిగ్గరగా అరవడం, నోరు పారేసుకోవడం వంటి చర్యలతో ఆమె ఆట తీరుపై విమర్శలు వచ్చాయి. ఈ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ కేవలం కొన్ని రోజులకే ఆరోగ్య కారణాలతో నిష్క్రమించడం అభిమానులను నిరాశపరిచింది. ఫినాలే వారంలో తిరిగి వస్తానని ఆయేషా ఆశాభావం వ్యక్తం చేసింది.

హౌస్‌లో ఇతర డ్రామా కూడా కొనసాగింది. కంటెండర్ టాస్క్‌లలో భాగంగా తనూజ, సంజన మధ్య సైలెన్సర్ విషయంపై గొడవ జరగ్గా, దువ్వాడ మాధురి, రీతూ చౌదరి డైరెక్ట్ కంటెండర్ స్థానం కోసం తీవ్ర వాదోపవాదాలకు దిగారు. మరోవైపు, కెప్టెన్సీ టాస్క్‌లో ఇమ్మాన్యుయేల్ విజయం సాధించాడు. ఈ టాస్కుల మధ్యలో తనూజ కళ్లు తిరిగి పడిపోవడంతో కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్‌తో సహా కొందరు కంటెస్టెంట్లు ఆందోళన చెందారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *