Bigg Boss 9

Bigg Boss 9: బిగ్‌బాస్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీల ట్విస్ట్.. అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యతో పాటు మరో నలుగురు ఎంట్రీ

Bigg Boss 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమైనప్పటి నుంచి ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతుంది. సెలబ్రిటీలు vs కామన్ మ్యాన్ కాన్సెప్ట్‌తో సాగుతున్న ఈ సీజన్‌ ఇప్పటివరకు రెండు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని మూడో వారంలోకి ప్రవేశించింది. ఎపిసోడ్‌కి ఎపిసోడ్‌ ట్విస్టులు, డ్రామాలు, వాదోపవాదాలతో ప్రేక్షకులకు వీలైనంత ఎంటర్టైన్‌మెంట్ అందిస్తోంది. హోస్ట్ నాగార్జున స్వయంగా వెల్లడించినట్టుగా, బిగ్ బాస్ 9 ప్రారంభమైన తర్వాత స్టార్ మా దేశంలోనే నంబర్ వన్ ఛానెల్‌గా ఎదగడం షో పాపులారిటీకి తెలియజేస్తుంది.

వైల్డ్ కార్డ్ 2.0 ఎంట్రీలు

ఈ సారి బిగ్ బాస్ నిర్వాహకులు షోను మరింత క్రేజీగా మలచాలని బిగ్ బాస్ 2.0 ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ రెండో లేదా మూడో వారంలో జరగనున్న ఈ ఈవెంట్‌లో ఐదుగురు కొత్త కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నారని సమాచారం. వీరిలో కొంతమంది కొత్తవారు, కొంతమంది పాత సీజన్లలో రాణించిన వారు ఉండనున్నారు.

సోషల్ మీడియాలో వినిపిస్తున్న వైల్డ్ కార్డ్ లిస్ట్ ఆసక్తికరంగా మారింది. అందులో:

  • సీరియల్ నటి సుహాసిని – బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఎంట్రీతో హౌస్‌లో భావోద్వేగాలు, డ్రామా పెరిగే అవకాశముంది.

  • సీరియల్ నటి కావ్య – యువ ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ ఉన్న ఈ నటి కూడా వైల్డ్ కార్డ్ లిస్ట్‌లో ఉంది.

  • శివ కుమార్ – టీవీ యాక్టర్‌గా, యూట్యూబ్ ద్వారా గుర్తింపు పొందిన ఆయన ఎంట్రీపై చర్చలు జరుగుతున్నాయి.

  • అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య (రమ్య మోక్ష కంచర్ల) – సోషల్ మీడియాలో తన కాంట్రవర్సీలతో పేరుగాంచిన రమ్యను వ్యూహాత్మకంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పంపిస్తున్నారట.

  • దివ్వెల మాధురి – రాజకీయంగా ప్రసిద్ధి చెందిన ఈమె కూడా హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.

పాత కంటెస్టెంట్ల రీఎంట్రీ?

అదేవిధంగా, గత సీజన్లలో రాణించిన కంటెస్టెంట్లను కూడా తిరిగి హౌస్‌లోకి ఆహ్వానించేందుకు ప్లాన్ జరుగుతోంది. సీజన్ 6 ఫేమ్ అమర్‌దీప్ చౌదరి, అలాగే హీరో తనీష్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరి రీఎంట్రీలతో గేమ్ మరింత ఉత్కంఠ భరితంగా మారుతుందని అంచనా.

రెట్టింపు ఎంటర్టైన్‌మెంట్

అంతేకాదు, ఈ వారం డబుల్ ఎవిక్షన్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని బిగ్ బాస్ రివ్యూయర్స్ చెబుతున్నారు. పాత కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేస్తూ, కొత్త ఎంట్రీలకు రెడ్ కార్పెట్ వేయడానికి బిగ్ బాస్ టీమ్ సిద్ధమవుతున్నట్టు సమాచారం.

ఏది ఏమైనా, కొత్త కంటెస్టెంట్ల ఎంట్రీలతో పాటు పాత ఫేవరెట్ ఫేస్‌ల రీఎంట్రీలు కలిపి, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మరింత మసాలా, డ్రామా, కాంట్రవర్సీలు జోడించి TRPలను రెట్టింపు చేసే అవకాశం కనిపిస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *