Bigg Boss 9

Bigg Boss 9: నేను నీకు పనిమనిషిని కాదు.. రీతూ తలకు గాయం.. నామినేషన్స్ లో రచ్చ రచ్చ

Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం నుంచే హౌస్‌లో గొడవలు మొదలయ్యాయి. ప్రతి సీజన్‌లో అందరూ ఎదురుచూసేది ఫస్ట్ వీక్ నామినేషన్స్. ఎందుకంటే, హౌస్‌లోకి వచ్చిన రెండో రోజే ఎవరు బయటకు వెళ్లాలో ఈ నామినేషన్స్ ద్వారా నిర్ణయిస్తారు. నామినేట్ చేయడానికి కంటెస్టెంట్లు ఎలాంటి కారణాలు చెబుతారో ఆడియన్స్‌కి ఆసక్తి ఉంటుంది. కానీ నిన్న జరిగిన నామినేషన్స్‌లో హీట్ కనిపించలేదు. “ఏదో చేయాలి కాబట్టి చేశాం” అన్నట్టు నామినేషన్స్ జరిగాయి.

కొంతమంది చెప్పిన కారణాలు చూస్తే: “వాళ్ల దగ్గర పాజిటివ్ వైబ్స్ రావడం లేదు”, “ఆమె కి నాతో మాట్లాడడం ఇష్టం లేదు”, “ఆమెని చూస్తేనే నచ్చడం లేదు” లాంటి చిన్న చిన్న కారణాలతో నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. కొందరు ఆడియన్స్ దృష్టిలో పడాలనే విసుగుగా అనిపించే పనులు చేస్తున్నారు. అందులో సంజనా ప్రవర్తన ఎక్కువగా హైలైట్ అయింది. ఆమె చేసే పనులు హౌస్‌లోని ఇతర కంటెస్టెంట్స్‌కి చిరాకు తెప్పిస్తున్నాయి. నిన్న ముఖ్యంగా సంజనా వల్ల ఫ్లోరా కన్నీళ్లు పెట్టుకుంది.

బిగ్ బాస్ హౌస్‌లో బాత్రూం క్లీన్ చేసే పనిని ఫ్లోరాకు అప్పగించారు. బాత్రూం లోపల ఉన్న షాంపూలు, కండీషనర్లు పెట్టవద్దని ఆమె బయటికి వచ్చి అందరికీ అరిచి చెప్పింది. వెంటనే సంజనా స్పందిస్తూ, “అవి నావే! నువ్వు ఎప్పుడూ నాతో గొడవ పెట్టుకోవాలనుకుంటావు” అంది. దానికి ఫ్లోరా, “ప్రతి సారి క్లీన్ చేసే సమయంలో వాటిని బయటకు తీయాలా? నేను నీకు పనిమనిషిని కాదు” అంటూ సమాధానం ఇచ్చింది.

ఇది కూడా చదవండి: Nara Lokesh: మంత్రి నారా లోకేష్ అనంతపురం పర్యటన రద్దు

అక్కడితో ఆగ్రహించిన సంజనా, “నీకు మాట్లాడే తీరు తెలియదు, మానర్స్ లేవు” అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడింది. ఫ్లోరా కన్నీళ్లు పెట్టుకోవడంతో, ఆడియన్స్ దృష్టిలో పడేందుకే ఇలా చేస్తోందంటూ కామెంట్స్ చేసింది. ఆ మాటలు విన్న సంజన మరింత కోపంతో, “ఏమన్నావ్? ఇదంతా ఫుటేజ్ కోసమా? నా ముందు వేలు చూపించి మాట్లాడకు” అంటూ హెచ్చరించింది. తరువాత “నువ్వు చీప్” అని కూడా అన్నది. తర్వాత ఇమ్మాన్యుయేల్‌ దగ్గరికి వెళ్లి శ్రీజను చూపిస్తూ, “అది సైకో.. దాన్ని చూస్తేనే చిరాకు వస్తోంది” అంటూ మాట్లాడింది.

కొంత సమయం తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కు, “మీరు మీలో ఒకర్ని నామినేట్ చేసుకోవాలి” అని చెప్పారు. దీని కోసం ఓ గేమ్ కూడా ఆడించారు. జాలేలో పాకుతూ వెళ్లి ముందున్న సుత్తి అందుకోవాలి. ఎవరు ముందుగా అందుకుంటారో వారు నామినేట్ చేయాలి. ఈ క్రమంలో రీతూ కి దెబ్బ తగిలింది. బిగ్ బాస్ ఆమెను మెడికల్ రూం‌కి పంపించి తలకు కట్టు కట్టించారు. తనూజ సంజనాను, రాము సుమన్ శెట్టిని నామినేట్ చేశారు. మిగతా నామినేషన్స్ ఈ రోజు ఎపిసోడ్‌లో కొనసాగనున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *