Bigg Boss 9 Telugu

Bigg Boss 9 Telugu: విన్నర్ రేసులో తనూజ, కళ్యాణ్, ఇమ్మానుయేల్..?

Bigg Boss 9 Telugu: ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న బిగ్ బాస్ సీజన్ 9 మరో కొద్ది రోజుల్లో గ్రాండ్ ఫినాలేకు చేరుకోనుంది. 12వ వారం కూడా విజయవంతంగా పూర్తి కావడంతో, టైటిల్ విన్నర్ ఎవరనే చర్చ సోషల్ మీడియాలో రసవత్తరంగా మారింది. ఈసారి ఫినాలే వేదికపై మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నారనే వార్త బిగ్ బాస్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.

విన్నర్ రేసులో త్రిముఖ పోరు!

ముందు నుంచి ఊహించినట్టే, ఈ సీజన్‌లో విజేత రేసు పోటాపోటీగా సాగుతోంది.

తనూజ: సీరియల్ బ్యూటీ తనూజ మొదటి నుంచి తన సత్తా చాటుతోంది. నిలకడగా అత్యధిక ఓటింగ్‌తో మొదటి స్థానంలో దూసుకుపోతున్న ఆమె విన్నర్ అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

కళ్యాణ్: తనూజకు గట్టి పోటీ ఇస్తూ, ఊహించని విధంగా విన్నర్ రేసులో దూసుకొచ్చిన కంటెస్టెంట్ కళ్యాణ్. అతని స్ట్రాటజీ, ఆటతీరు అతన్ని పీక్స్‌కు తీసుకెళ్లింది.

ఇమ్మానుయేల్: కామెడీతో పాటు గేమ్‌లో మంచి పాజిటివ్ వైబ్ చూపించిన ఇమ్మానుయేల్ కూడా టాప్-3లో నిలబడ్డాడు.

ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే, ఈ ముగ్గురిలో టైటిల్ ఎవరికి దక్కుతుందో ఊహించడం చాలా కష్టం. ఈ త్రిముఖ పోరే ఫినాలే ఉత్కంఠను పెంచుతోంది.

అనూహ్య ఎలిమినేషన్స్… ఆ షాకింగ్ ట్విస్ట్ నిజమేనా?

చివరి దశకు చేరుకున్న ఈ బిగ్ బాస్ హౌస్‌లో ప్రస్తుతం సంజన, సుమన్ శెట్టి, డీమాన్ పవన్, భరణి శంకర్, రీతూ చౌదరి, ఇమ్మానుయేల్, తనూజ, కళ్యాణ్ ఉన్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని మొదట్లో ప్రచారం జరిగింది.

అయితే, ఓటింగ్ సరళిని బట్టి చూస్తే, సుమన్ శెట్టి లీస్ట్ ఓటింగ్‌లో ఉన్నందున అతను బయటకు వచ్చే అవకాశం ఉందని భావించారు. కానీ, సోషల్ మీడియాలో వినిపిస్తున్న తాజా టాక్ ప్రకారం… అనూహ్యంగా రీతూ చౌదరి ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఊహించని ఎలిమినేషన్ షోకు ఒక పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి.

టాప్ 5 అంచనాలు:

ఇక గ్రాండ్ ఫినాలేకు ముందు హౌస్‌లో మరిన్ని ట్విస్టులు ఉన్నాయట. వచ్చే వారం మిడ్ వీక్ ఎలిమినేషన్తో పాటు వీకెండ్‌లో మరొకరిని బయటకు పంపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుత సోషల్ మీడియా ట్రెండింగ్ ప్రకారం, ఫైనల్‌కు చేరుకునే టాప్ 5 కంటెస్టెంట్లు వీరేనని దాదాపు ఫిక్స్ అయ్యింది:

  1. కళ్యాణ్ పడాల
  2. తనూజ
  3. ఇమ్మానుయేల్
  4. డీమాన్ పవన్
  5. భరణి శంకర్

మిగతా కొద్ది రోజులు ఆట మరింత రసవత్తరంగా సాగడం ఖాయమని, టైటిల్ గెలుచుకునేది ఎవరు, రన్నరప్‌గా నిలిచేది ఎవరనేది చూడాల్సిందే.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *