Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో 13వ వారం అనూహ్యమైన మలుపు తిరిగింది. టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరిగా గట్టి పోటీ ఇస్తుందనుకున్న రీతూ చౌదరి ఎలిమినేట్ అయ్యి బయటకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రీతూ కన్నా ఆటలో వెనుకబడిన సంజన, సుమన్ శెట్టి వంటి కంటెస్టెంట్లు ఇంట్లో ఉండగా, స్ట్రాంగ్ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్న రీతూ బయటకి రావడం ఇప్పుడు బిగ్‌బాస్ అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది.
నెగెటివిటీని తట్టుకొని… ‘ఆటపులి’గా మారిన రీతూ
బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టకముందే రీతూపై విపరీతమైన నెగెటివిటీ ఉండేది. అయితే హౌస్‌లో ఆమె ప్రయాణం మరింత ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా డెమోన్‌తో ఆమె నడిపిన లవ్ ట్రాక్ ఆడియన్స్‌తో పాటు తోటి కంటెస్టెంట్ల నుండి, వైల్డ్ కార్డుల నుండి కూడా తీవ్ర విమర్శలకు గురైంది.
ఎన్ని అవాంతరాలు ఎదురైనా, రీతూ తన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఎంటర్టైన్‌మెంట్‌తో అలరిస్తూనే, టాస్క్‌ల విషయంలో ‘ఆడపులి’ లా మారి స్ట్రాంగ్ కంటెస్టెంట్లకు కూడా చుక్కలు చూపించింది. ఫేక్ ఏడుపుల కంటెస్టెంట్ అనే ముద్రను చెరిపేసుకుని క్యూట్ రీతూగా, స్ట్రాంగ్ ప్లేయర్‌గా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది.
ఇది కూడా చదవండి: Nirmal: నిర్మల్ జిల్లాలో దారుణం.. టీ పాయింట్‌లో మహిళ దారుణ హత్య
చాలా మంది డెమోన్‌తో తన బంధం మైనస్ అవుతుందనుకుంటే, అదే ఆమెకు ప్లస్ పాయింట్‌గా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే హౌస్‌లో వీరిద్దరికీ సపోర్ట్ చేసే కంటెస్టెంట్లు లేకపోయినా, ఈ బంధం ద్వారా ఆమె 13వ వారం వరకు కొనసాగగలిగింది. టాప్ 5కు వెళ్లడం ఖాయమనుకున్న సమయంలో, ఆమె అనూహ్యంగా హౌస్ నుండి బయటకు వచ్చింది.
13 వారాలకు భారీ పారితోషికం!
హౌస్‌లో 13 వారాల పాటు తనదైన ముద్ర వేసిన రీతూ చౌదరి, భారీగానే పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, రీతూకి వారానికి రూ. 2 లక్షల చొప్పున రెమ్యూనరేషన్ అందినట్లు సమాచారం. అంటే, మొత్తం 13 వారాలకు గానూ ఆమె ఏకంగా రూ. 26 లక్షలు తన ఖాతాలో వేసుకున్నట్టు సమాచారం. ఆటలో గెలిచినా, గెలవకపోయినా, ఈ మొత్తం ఆమెకు మంచి బూస్ట్‌ను ఇచ్చిందనే చెప్పవచ్చు.
సంజనతో గొడవ వల్లే రీతూ ఎలిమినేషన్?
రీతూ ఎలిమినేషన్‌కు గత వారం సంజనతో జరిగిన తీవ్ర వాగ్వాదమే ప్రధాన కారణమనే చర్చ జరుగుతోంది. డెమోన్-రీతూ బంధంపై సంజన చేసిన అనుచిత వ్యాఖ్యలు (రాత్రిపూట హత్తుకుని కూర్చుంటే కళ్ళు మూసుకోవాల్సి వస్తోంది లాంటివి) మొదట్లో రీతూకి కొంత సానుభూతిని తెచ్చాయి.
అయితే, వీకెండ్‌లో నాగార్జున సంజనకు సీరియస్‌గా క్లాస్ పీకడంతో పరిస్థితి తారుమారైంది. కావాలనే సంజనను టార్గెట్ చేస్తున్నారంటూ ఆమెకు అనుకూలంగా కథ అడ్డం తిరిగింది. సంజన తన తప్పు ఒప్పుకోకుండా సెల్ఫ్-రెస్పెక్ట్‌కు ఓటు వేయడంతో, చాలా మంది అభిమానులు ఆమెకు మద్దతు పలికి ఓట్లు వేశారు. ఫలితంగా, రీతూ కంటే సంజనకు ఎక్కువ ఓట్లు పడటంతో రీతూ హౌస్ నుండి బయటకు రావాల్సి వచ్చింది.

