Bigg Boss 9 Telugu: మొదలైన బిగ్ బాస్ సీజన్ 9.. దీనికి సంబందించిన మొదటి ఎపిసోడ్ నిన్న టెలికాస్ట్ అయింది. ఈ ఎపిసోడ్ లోనే రసవత్తర ఘటనలు చోటుచేసుకున్నాయి. హౌస్ మేట్స్ మధ్య చిన్న చిన్న గొడవలు మొదలయి, మొదటి రోజే కాంటెస్ట్ ల మధ్య మాటల యుద్ధాలు జరిగాయి. ముఖ్యంగా హరీష్ మరియు ఇమ్మాన్యుయేల్ మధ్య చిన్న మాటల వివాదం జరిగింది.
హౌస్‌లో ఐదుగురు కామనర్లు, తొమ్మిది మంది సెలబ్రిటీలు చేరడం ఫ్యాన్స్‌కి కొత్త ఎక్సైట్మెంట్ను తెచ్చింది. పోదు పొద్దున్నే “రా మచ్చా మచ్చా” పాటతో హౌస్ మేట్స్‌కి బిగ్ బాస్ నిద్రలేపారు. అక్కడ ఉన్న అందరూ వాళ్లకి వాచినట్టు డాన్సులు వేసి ఆరోజుని స్టార్ట్ చేశారు.
స్టార్టింగ్ డే లోనే బిగ్ బాస్ తన గేమ్ స్టార్ట్ చేసింది, ఇప్పుడీ హౌస్ ఓనర్స్ మరియు టెనెంట్స్ మధ్య డైనమిక్ కూడా ఆసక్తికరంగా సాగింది. ఓనర్స్ టెనెంట్స్‌కి “మమ్మల్ని ఇంప్రెస్ చేస్తే హౌస్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది, మీకు నచ్చిన ఫుడ్ తినొచ్చు” అని ఒక ఆఫర్ ఇచ్చారు. అయితే బిగ్ బాస్ తక్షణమే స్పందిస్తూ, “హౌస్ ఓనర్లది అని మర్చిపోయారా?” అని కామనర్లకు గుర్తు చేశారు.
ఇది కూడా చదవండి: Perni Nani: కూటమి ప్రభుత్వంలో రైతులకు కన్నీళ్లు.. పేర్ని నాని తీవ్ర విమర్శలు!
ఆ తర్వాత, ఓనర్స్ టెనెంట్స్‌కి కొన్ని పనులు అప్పగించారు. హౌస్ క్లీనింగ్‌కి శ్రష్టి, ఇమ్మాన్యుయేల్, కుకింగ్‌కి తనూజ, భరణిలని ప్రియా అప్పగించింది. కానీ వంటగది క్లీన్ చెయ్యనని తనూజ, భరణిలు రిఫ్యూజ్ చేయడం, ప్రియాతో హరీష్ మధ్య తగాదాకు దారి తీసింది. మనీష్ వాదనలోకి రావడం కూడా హరీష్‌తో గొడవకు కారణమైంది. చివరకు ఓనర్లు హరీష్ ప్రవర్తనపై చర్చించుకున్నారు.
తర్వాత బిగ్ బాస్ మరో షాక్ ఇచ్చాడు. హౌస్ ఓనర్లది కాబట్టి టెనెంట్స్ బయటకు వెళ్లాలని, తింటున్న ఫుడ్ కూడా వదిలివేయాలని ఆదేశించాడు. హరీష్ కెమెరాకు ముందుగా వెళ్లి ఇమ్మాన్యుయేల్‌ను తిననివ్వమని అడిగాడు, కానీ బిగ్ బాస్ స్పందించలేదు. ఆ తర్వాత హరీష్ దగ్గర ఉన్న ఫుడ్ స్టోర్ రూమ్‌కి తరలించమని బిగ్ బాస్ చెప్పడంతో హరీష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
కానీ, సర్ప్రైజ్ ఇక్కడే ముగిసింది కాదు. అందరిని గార్డెన్ ఏరియాలోకి పిలిచి, బిగ్ బాస్ ఫుడ్ ఇచ్చి సర్ప్రైజ్ ఇచ్చారు. “ఇవ్వబడిన ఫుడ్ మాత్రమే తినాలి” అని నిబంధించారు. ఈ సంఘటన తర్వాత ఓనర్లు మరియు కామనర్లు వేర్వేరు వైపులకి కూర్చోవడం, హౌస్ వాతావరణాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. మొత్తం మీద, మొదటి రోజు నుంచే బిగ్ బాస్ హౌస్‌లో డ్రామా, షాక్, సర్ప్రైజ్తో ఫ్యాన్స్‌ని కట్టిపడేసింది.