Bigg Boss 9 Telugu

Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్ షాకింగ్ ఎలిమినేషన్.. రాము రాథోడ్, భరణి..అవుట్..? షాక్‌లో ఆడియన్స్!

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ప్రతి వారం ఒక ట్విస్ట్ తప్పకుండానే వస్తోంది. ఐదో వారం దమ్ము శ్రీజ ఎలిమినేషన్‌తో షాక్ తగిలితే, ఆరో వారం కూడా అంతకంటే షాకింగ్ టర్న్ తీసుకుంది. నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో  రాము రాథోడ్, తనూజ, భరణి, దివ్య నిఖిత, సుమన్ శెట్టి, డెమాన్ పవన్  మధ్య ఓటింగ్ గట్టి పోటీగా సాగింది. కానీ చివరికి ఎవరు బయటకు వెళ్ళారు? ఎవరి లెక్క ఎలా తిరిగిందో చూద్దాం.

వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్ గాడి తప్పింది

ఐదో వారం వరకు బిగ్ బాస్ హౌస్ కొంత సాఫీగా సాగింది. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చిన తర్వాత హౌస్ వాతావరణం పూర్తిగా మారిపోయింది. గత సీజన్‌లో వైల్డ్ కార్డ్స్ షోను బాగు చేసారు, కానీ ఈసారి మాత్రం రివర్స్ అయ్యింది. దువ్వాడ వారి దివ్వెల మాధురి ఎంట్రీతోనే ఆడియన్స్‌లో నెగిటివిటీ పెరిగింది. ఆమె అహంకారమే కాకుండా, ఇతర కంటెస్టెంట్స్‌తో చేసే గొడవలు కూడా జనం అసహ్యించుకునే స్థాయిలోకి వెళ్ళాయి.

నామినేషన్స్‌లో ఎవరు సేఫ్, ఎవరు డేంజర్?

ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో తనూజ మాత్రం ప్రారంభం నుంచే సేఫ్ జోన్‌లో ఉంది. ఆమెకు కంటిన్యూ గా స్ట్రాంగ్ ఓటింగ్ రావడంతో టాప్ స్థానంలో నిలిచింది.

మిగిలిన ఐదుగురిలో  సుమన్ శెట్టి, దివ్య నిఖిత, రాము రాథోడ్, భరణి, డెమాన్ పవన్  మధ్య ఓటింగ్ గట్టి పోటీగా సాగింది.

సమయం పోల్స్ ప్రకారం:

1️⃣ సుమన్ శెట్టి – 28%

2️⃣ దివ్య నిఖిత – 25%

3️⃣ డెమాన్ పవన్ – 18%

4️⃣ రాము రాథోడ్ – 11%

5️⃣ తనూజ – 10%

6️⃣ భరణి – 8%

ఇదే లెక్క చూస్తే సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపించింది. కానీ షోలో ప్రతి వారం జరుగుతున్నట్లే ఈసారి కూడా బిగ్ బాస్ అనూహ్యంగా ట్విస్ట్ ఇచ్చాడు.

సోషల్ మీడియా టాక్ వర్సెస్ అసలు రిజల్ట్

సోషల్ మీడియాలో మొదట ఫోక్ సింగర్ రాము రాథోడ్ ఎలిమినేట్ అవుతారని ప్రచారం జరిగింది. మరికొన్ని పోల్స్‌లో దివ్య నిఖిత ఎలిమినేట్ అవుతుందని ఊహించారు. అయితే చివరి నిమిషంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

సోషల్ మీడియా ట్రెండ్స్, యూట్యూబ్ పోల్స్, ఫ్యాన్స్ ఓటింగ్ అన్నీ కలిపి గమనిస్తే, ఈ వారం భరణి ఎలిమినేట్ అయినట్లు సమాచారం.

భరణి ఎలిమినేషన్‌ – ఆడియన్స్‌లో మిక్స్ రియాక్షన్

భరణి బిగ్ బాస్ హౌస్‌లో ఎమోషనల్ బాండింగ్స్‌తో, ఫ్యామిలీ కనెక్ట్‌తో జనం మన్ననలు పొందాడు. కానీ కొన్నిసార్లు అతని ఓవర్ ఎమోషనల్ నేచర్ కారణంగా హౌస్‌లో తేడాలు వచ్చాయి. ఈ వారం ఓటింగ్ పీక్స్‌లో ఉన్నప్పుడు, కాస్త తక్కువ ఓట్లు రావడంతోనే అతను ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.

ఇక నెట్టింట మాత్రం “భరణి ఎలిమినేట్ ఫెయిర్ కాదు” అనే కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.

డెమాన్ పవన్ – నెగిటివ్ ట్రాక్ ఉన్నా గేమ్‌లో సేఫ్

డెమాన్ పవన్ లవ్ ట్రాక్ కారణంగా ఆడియన్స్‌లో నెగిటివిటీ తెచ్చుకున్నా, టాస్కుల్లో చూపించిన పర్ఫార్మెన్స్‌తో సేఫ్ అయ్యాడు. రీతూ చౌదరి ఈ వారం నామినేషన్‌లో లేకపోవడం అతనికి అదనపు బూస్ట్ ఇచ్చింది.

రాము రాథోడ్ – సైలెంట్ ప్లేయర్

రాము రాథోడ్ ఈ సీజన్‌లో పెద్దగా హైలైట్ కాలేదు. కానీ ఫోక్ సింగర్‌గా తన ఇమేజ్‌ కారణంగా కొంతమంది ఓటింగ్ ఇచ్చారు. అయితే హౌస్‌లో కనపడే కంటెంట్ తక్కువ కావడం వల్ల ఎలిమినేషన్ టాక్‌లో ఎప్పుడూ ఉంటూనే ఉన్నాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *