Bigg Boss 9: బిగ్‌బాస్ హౌస్‌లో 9వ వారపు నామినేషన్స్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దివ్వెల మాధురి ఎలిమినేట్ అయిన వెంటనే, హౌస్‌మేట్స్ మధ్య ఇంతవరకూ ఉన్న బంధాలు పక్కకు పోయి, వాదనలు, గొడవలు చెలరేగాయి. ముఖ్యంగా తనూజ, దివ్య, భరణిల మధ్య జరిగిన వాగ్యుద్ధం ఈ ఎపిసోడ్‌కే హైలైట్‌గా నిలిచింది.
మొదటగా బిగ్‌బాస్ ‘బొమ్మల టాస్క్’ ప్రారంభించారు. గార్డెన్ ఏరియాలో ఇంటి సభ్యుల ఫోటోలతో ఉంచిన బొమ్మలను తీసుకొని ముందుగా సేఫ్ జోన్‌లోకి వెళ్లాలని, చివరగా మిగిలిన వ్యక్తి చేతిలో ఎవరి బొమ్మ ఉంటే వారు నామినేట్ అవుతారని బిగ్‌బాస్ తెలిపారు. మొదటి రౌండ్‌లో సంజన చివరగా మిగిలింది, ఆమె రీతూని నామినేట్ చేస్తూ, రీతూ ఆటలో డీమాన్ పవన్ సహాయం ఉందని ఆరోపించింది. వెంటనే సంజన కిచెన్ దగ్గరకు వెళ్లి ఏడుపు లంఘించుకుంది, రీతూ తన కోసం జుట్టు కత్తిరించుకున్నా, ఆమెతో గొడవపడాల్సి వచ్చిందని బోరుమంది. రెండవ రౌండ్‌లో సుమన్ శెట్టి వద్ద తనూజ బొమ్మ ఉన్నా, అతను తనను తాను సెల్ఫ్ నామినేట్ చేసుకుని ఆకట్టుకున్నాడు.
Also Read: Pāraśakti: పరాశక్తి మొదటి సింగిల్ వచ్చేస్తుంది?
ఈ ఆటతీరు నచ్చకపోవడంతో బిగ్‌బాస్ నియమాలు మార్చారు. కొత్త నిబంధనల ప్రకారం, నామినేట్ అయిన సభ్యులు వచ్చి వాదించుకున్న తర్వాత, సంచాలకులే వారిలో ఒకరిని డైరెక్ట్‌గా నామినేట్ చేయాల్సి వచ్చింది. ఈ ప్రక్రియలో భరణిని డీమాన్ పవన్ ‘సేఫ్ గేమ్’ ఆడుతున్నాడని ఆరోపించాడు. అనంతరం భరణి, తనూజ మధ్య తీవ్రమైన వాదన జరిగింది. పాత బంధాలు, టాస్కులలో సహాయం గురించి ఇద్దరూ విమర్శించుకున్నారు. వారి వాదన విన్న సంచాలకురాలు దివ్య, అనూహ్యంగా భరణిని నామినేట్ చేసి షాకిచ్చింది. తర్వాత ఇమ్మానుయేల్‌ను తనూజ నామినేట్ చేయగా, ‘నువ్వు బెడ్ టాస్క్‌లో చీర కట్టుకొని పెళ్లి కూతురులా కూర్చుంటే మేము సపోర్ట్ చేయకపోతే ఎలా వచ్చావ్ టాప్-5లోకి?’ అంటూ ఇమ్మూ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు.
చివరికి, కెప్టెన్ దివ్యకు స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్‌బాస్. దివ్య ఈ పవర్‌ను ఉపయోగించి తనూజను నేరుగా నామినేట్ చేసింది. దివ్య నామినేషన్‌కు కారణం చెబుతూ, తనూజ భరణితో ఉన్న బాండ్‌ను తాను బ్రేక్ చేశాననే భావన కలిగిందని ఆరోపించింది. దీంతో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం మరింతగా పెరిగింది. దివ్య, ‘నువ్వు ఏం ఆడావ్? ప్రతి గేమ్‌లోనూ సపోర్ట్ లేకుండా ఆడలేకపోయావ్’ అని ప్రశ్నించగా, తనూజ కూడా దీటుగా సమాధానం ఇచ్చింది. ఇలా చివరికి నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యేసరికి ఈ వారం ఎలిమినేషన్ కోసం సంజన, సుమన్ శెట్టి, భరణి, కళ్యాణ్, రాము, సాయి, తనూజ మొత్తం ఏడుగురు సభ్యులు నామినేట్ అయ్యారు.

