Bigg Boss 9

Bigg Boss 9: డీమాన్ పవన్ పై సంజన ఫైర్.. ‘నీకు అమ్మాయిలే కనిపిస్తారు’ అంటూ.!

Bigg Boss 9: బిగ్‌బాస్ సీజన్ 9 లో నాలుగో వారం ప్రారంభమైంది. తొలి మూడు వారాల్లో శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియ ఎలిమినేట్ కాగా, తాజాగా ఇంట్లో మరోసారి కిచెన్‌లో పెద్ద గొడవ జరిగింది. ఈసారి ఈ రచ్చకు కెప్టెన్ డీమాన్ పవన్, ఫుడ్ మానిటర్ తనూజతో పాటు హౌస్‌మేట్ సంజన కారణమయ్యారు.

నిన్నటి ఎపిసోడ్‌లో సంజన, తనూజ మధ్య మొదలైన గొడవ కెప్టెన్ డీమాన్ పవన్‌పైకి మళ్లింది. బ్రేక్‌ఫాస్ట్ తయారైన తర్వాత తనూజను అడిగి సంజన పోపు పెట్టుకోవడానికి కిచెన్ వద్దకు వెళ్లగా, కెప్టెన్ పవన్ అడ్డుకున్నాడు. బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక మళ్లీ ఎందుకు పోపు అంటూ పవన్ ప్రశ్నించడం, దివ్య కూడా తనకు టైమ్ లేదని చెప్పడంతో సంజన కోపం పెరిగింది. చిన్న పోపు కోసం ఇంత గొడవ చేయాలా అని సంజన అడిగితే, డీమాన్ వెల్లుల్లి లేవంటూ నసిగాడు. దీంతో ఆగ్రహించిన సంజన.. ‘తినడానికి భిక్ష వేస్తున్నారా’ అంటూ అరిచి లోపలికి వెళ్లిపోయింది.

Also Read: Deepika Padukone: డైరెక్టర్‌ని అన్ ఫాలో చేసిన దీపిక పదుకొణె

కెప్టెన్‌పై సంజన సంచలన ఆరోపణలు
ఆ తర్వాత డీమాన్ పవన్ సారీ చెప్పేందుకు సంజన వద్దకు వెళ్లగా, ఆమె మరింత తీవ్రంగా ఫైర్ అయ్యింది. “రీతూ, తనూజ, శ్రీజ, దివ్య లాంటి అమ్మాయిలు అడిగితే నువ్వు చేసుండేవాడివి. నేను అడిగాను కాబట్టి నువ్వు నో చెప్తున్నావ్! నీకు అమ్మాయిలే కనిపిస్తారు, అమ్మాయిలు అడిగితే నో చెప్పవు” అంటూ డీమాన్‌పై పక్షపాతం ఆరోపణలు చేసింది. సంజన కన్నీళ్లు పెట్టుకోవడం, డీమాన్ సమాధానం చెప్పడానికి ప్రయత్నించడం ఆ ఎపిసోడ్‌లో కనిపించింది.

దీనికి ముందు, రెండోసారి కెప్టెన్ అయిన డీమాన్ పవన్, గత వారం దొంగతనం చేసిన వారిని జైల్లో వేస్తానంటూ ఓవరాక్షన్ చేశాడు. దమ్ముంటే వెయ్ అంటూ సంజన సవాల్ విసరడంతో డీమాన్ కాస్త వెనక్కి తగ్గాడు.

ఇమ్యూనిటీ టాస్క్‌లో గెలుపు
మరోవైపు, ఈ వారం నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యేందుకు బిగ్‌బాస్ పెట్టిన ఇమ్యూనిటీ టాస్క్ ఉత్కంఠగా సాగింది. డీమాన్ సంచాలక్‌గా వ్యవహరించగా, హౌస్‌మేట్స్‌ను ఆరు టీములుగా విభజించారు. సుమన్ శెట్టి, దివ్య టీమ్ మొదటి రౌండ్‌లో నిలవగా, రెండో రౌండ్‌కు తనూజ, ఫ్లోరా ఎంపికయ్యారు. చివరికి, సుమన్ శెట్టి, తనూజ ఇమ్యూనిటీని దక్కించుకుని ఈ వారం నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *