Bigg Boss 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే 12వ వారంలోకి అడుగుపెట్టింది. ఇంకా మూడు వారాల్లో ఫైనల్ ఎపిసోడ్ రానుండటంతో హౌస్‌లో టెన్షన్, టాస్కులు, గొడవలు మరింతగా పెరుగుతున్నాయి. ఇటీవల ముగిసిన ఫ్యామిలీ వీక్‌లో కంటెస్టెంట్స్‌కు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు వచ్చి హౌస్‌ను సందడిగా మార్చినా… అసలు గేమ్ మొదలైంది ఇప్పుడు.
ఫ్యామిలీ వీక్ ముగిసిన వెంటనే హౌస్ మూడ్ పూర్తిగా మారింది. వీకెండ్‌లో ప్రశాంతంగా ఉన్న కంటెస్టెంట్స్ వారమొచ్చే సరికి ఘర్షణలకు, ఆరోపణలకు తెరలేపారు. టీఆర్పీ తగ్గుతుందేమో అనిపిస్తే చాలు, హౌస్‌లో ఎక్కడో ఒక రచ్చ ఇలా మొదలవుతుందనేది గత కొన్ని వారాల పద్ధతి. ఈసారి ఆ హీట్‌కు కారణం సంజన.
సంజన, రీతూ చౌదరి–డీమాన్ పవన్ మధ్య ఉన్న బాండింగ్‌పై వ్యాఖ్యలు చేయడంతో హౌస్ ఒక్కసారిగా షాక్ అయ్యింది. రాత్రిళ్లు రీతూ–పవన్ కలిసి కూర్చోవడం తనకు ఇష్టం లేకుండా ఉందని, అది తన కళ్ల ముందు చూడలేకపోతున్నానని సంజన చెప్పడం హౌస్‌లో పెద్ద టాపిక్ అయింది. ఈ వ్యాఖ్యలు రీతూను తీవ్రంగా బాధించాయి. ఇమ్మాన్యుయేల్ కూడా సంజనతో అసహనం వ్యక్తం చేస్తూ, ఇలాంటి మాటలు మాట్లాడటం సరైంది కాదని హెచ్చరించాడు.
Also Read: Pradeep Ranganathan: లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. మరో 100కోట్ల సినిమా అవుతుందా..?
నిన్న జరిగిన నామినేషన్స్ ఎపిసోడ్‌లో ఉద్రిక్తతలు మరింత ఎక్కువయ్యాయి. కెప్టెన్‌గా ఉన్న రీతూ, సంజనను నామినేట్ చేస్తూ తన కారణాలు వివరించింది. ఈ సమయంలో సంజన డిఫెండ్ చేసుకునే క్రమంలో మాట దాటి, రీతూ–డీమాన్ రిలేషన్ గురించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేసింది. రాత్రిళ్లు డీమాన్ దగ్గర కూర్చోవడం తనకు అసహనం కలిగిస్తోందని మరోసారి చెబితే, రీతూ ఎమోషనల్ అయ్యింది. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడంతో హౌస్‌లోని అందరూ సంజన ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
తనూజ–దివ్య, సంజనను పక్కకు తీసుకెళ్లి మాట్లాడించినా కూడా ఆమె తన మాటలపై నిలబడటం హౌస్‌లో మరింత ఉద్రిక్తతను పెంచింది. ఇమ్మాన్యుయేల్ కూడా వరుసగా సంజనపై సీరియస్‌గా మాట్లాడినా ఆమె వెనక్కి తగ్గలేదు. ఇదిలా ఉండగా దివ్య–తనూజ మధ్య గతంలో వచ్చిన తగాదా ఈఎపిసోడ్‌లో సులభంగా ముగిసింది. ఇద్దరూ పరస్పర నామినేషన్స్‌లో క్లారిటీ ఇస్తూ హగ్ చేసి తమ గొడవకు ముగింపు పలికారు.
డీమాన్–కళ్యాణ్ మధ్య ఫిజికల్ ఘర్షణ చోటుచేసుకున్న ఘటన కూడా ఈ ఎపిసోడ్‌లో ప్రధాన హైలైట్. ఈ గొడవ, హౌస్ ప్రాపర్టీ డ్యామేజ్ కారణంగా ఎపిసోడ్ మొత్తం వైలెన్స్‌తో నిండి పోయింది. ఈ వారం నామినేషన్లలో కెప్టెన్ రీతూ తప్ప మిగతా ఎనిమిది మందీ లిస్ట్‌లో చేరడంతో పోటీ మరింత కఠినంగా మారింది. రాబోయే ఎపిసోడ్‌లు ఇంకా పెను రచ్చతో నిండే అవకాశం కనిపిస్తోంది. ఫినాలే దగ్గర పడుతుండటంతో ప్రతి నామినేషన్, ప్రతి టాస్క్, ప్రతి మాట కంటెస్టెంట్స్ ఫ్యూచర్‌ను మార్చే స్థాయిలో ఉండబోతోంది.
