Bigg Boss 9: బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటినుండి ఆడియన్సు కి ప్రతి రోజు ఎంటర్టైన్మెంట్ లో హే డోకా లేకుండా చుస్తునారు.. గొడవలు, టాస్క్ లు, గోషిప్స్ ఇలా వారం మొత్తం సాగుతుంది. వరం చివరలో నాగార్జున వచ్చి అందరికి ఒక్క క్లాస్ పీకి, ప్రతి ఒక్కరిని కడిగేస్తారు. నిన్నటి ఎపిసోడ్ లో ఒకొక్కరి బాక్స్ బద్దలు కొడతానని సీరియస్ అయ్యారు.
ముందుగా ప్రియా, శ్రీజ, సంజన- ఫ్లోరా ఇష్యూ మీద నాగ్ క్లారీటీ తీసుకున్నారు. సంజన ఫ్లోరాకు కాఫీ ఇవ్వొద్దని చెప్పిందని ప్రియా–శ్రీజలు నాగ్‌కు చెప్పినట్లు తెలిపారు. దీంతో నాగ్, ఫ్లోరా–సంజన మధ్య లో ప్రియా–శ్రీజలు ఎందుకు కలగజేసుకున్నారని గట్టిగానే ప్రశ్నించారు.
తర్వాత వెంటనే హరీష్–ఇమ్మానుయేల్ ఇష్యూపైకి వెలిపొయ్యారు నాగ్. ఇమ్మానుయేల్ హరీష్‌ను “గుండు అంకుల్” అని పిలవడం, దానికి హరీష్ సీరియస్ కావడం. ఈ విషయం గురించి నాగ్, ఇమ్మానుయేల్‌ని అడగగా, తాను కేవలం సరదాగా అన్నానని చెప్పాడు. హరీష్ మాత్రం తాను నన్ను కావాలనే అన్నాడు నా విషయంలో లైన్ క్రాస్ చేస్తే నేను తట్టుకోలేను అన్ని సీరియస్ గా చెప్పాడు. నాగార్జున ఎంత చుపుతున్న తన వాదన తనదే అన్నటు హరీష్ మాట్లాడం చిరాకు తెప్పియడం తో హౌస్ లో ఉన్న అందరిని అడ్డగగా మాకు ఫన్నీ గానే అనిపించిందని చెప్పుకొచ్చారు. అయితే, హరీష్ మాత్రం తన వాదనను కొనసాగించాడు.
ఇక తర్వాత “రెడ్ ఫ్లవర్” కామెంట్ మీద హౌస్ మొత్తం షాక్ అయ్యింది. నాగ్ వీడియో చూపించగా, హరీష్ ఇమ్మానుయేల్‌ని ఆ పదంతో పిలిచినట్లు క్లియర్‌గా బయటపడింది. హౌస్‌లో చాలా మంది ఆ పదం అనుచితమని అన్నారు. కానీ శ్రీజ ఫన్నీగా ఉందని చెప్పగా, సంజన మాత్రం అది డబుల్ మీనింగ్‌లో అన్నారని చెప్పింది. దాంతో హరీష్ సంజనపై మండిపడ్డాడు. నాగ్ మాత్రం “నేను మాట్లాడుతున్నా, రాష్ టాక్ వద్దు” అంటూ వార్నింగ్ ఇచ్చారు. చివరికి హరీష్ తన తప్పును ఒప్పుకుని, “సారీ బ్రదర్, అవసరం అయితే షో నుంచి క్విట్ అవుతా” అని అన్నాడు.
నాగ్ ఇక్కడితో ఆగలేదు. హరీష్ ఆడపిల్లల మీద గౌరవం లేని విధంగా మాట్లాడిన పాత వీడియోలు కూడా చూపించారు. భరణి, ఇమ్మూ, తనూజలతో ఉన్న సందర్భంలో “ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి” అన్న వ్యాఖ్యలను బయటపెట్టారు. దాంతో హౌస్‌లో మిగతావారు అందరూ హరీష్ తప్పు చేశాడని స్పష్టంగా చెప్పారు.
ఎపిసోడ్ చివర్లో నాగ్, హరీష్‌కు సూటిగా చెప్పారు: “నీ ఫ్రెండ్స్‌కి నువ్వు హరిత హరీష్‌గా అనిపించుకోవచ్చు. కానీ నేను మాత్రం నిన్ను కరెక్ట్ చేస్తూనే ఉంటా” అని.