Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 శనివారం నాటి ఎపిసోడ్ పూర్తిగా నిప్పు రాజేసేలా సాగింది. హోస్ట్ నాగార్జున హౌస్‌లోకి అడుగుపెట్టి, తప్పులు చేసిన హౌస్‌మేట్స్‌కు ఒక్కొక్కరికీ వారి ఫోటో ఫ్రేమ్‌లకు కత్తి గుచ్చి మరీ గట్టిగా క్లాస్ పీకారు. ముఖ్యంగా, డీమోన్ పవన్ (Demon Pavan) తన సహచర కంటెస్టెంట్ రీతూ చౌదరి పట్ల వ్యవహరించిన తీరుపై నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
డీమోన్ పవన్‌కు క్లాస్.. రీతూతో గొడవ జరిగే క్రమంలో, కోపంతో పవన్ ఆమెను బెడ్ మీదకు తోసేసిన (మ్యాన్ హ్యాండ్లింగ్) వీడియోను నాగార్జున ప్లే చేసి చూపించారు. ఆడపిల్లపై చేయి చేసుకోవడం ఎంతమాత్రం సరికాదని, ఇది హౌస్‌కే కాదు, షో యొక్క ఇమేజ్‌కు కూడా సంబంధించిన విషయం అని నాగార్జున మండిపడ్డారు. “ఇలాంటి బిహేవియర్ మీ ఇంట్లో ఆడపిల్లలపై చేస్తే బెల్టుతో కొడతారా కాదా?” అంటూ ఆడియెన్స్‌ను అడిగారు.
నాగార్జున ఫైర్ అవుతూ, “బ్యాగ్ సర్దుకో, బిగ్ బాస్ డోర్స్ ఓపెన్ చేయండి” అంటూ పవన్‌ను హౌస్ నుండి బయటకు వెళ్లిపోవాలని సీరియస్‌గా ఆదేశించారు. పవన్ చేసిన తప్పును హౌస్‌మేట్స్, ఆడియన్స్ కూడా ధృవీకరించడంతో, పవన్ చేతులు జోడించి క్షమాపణలు చెప్పి, “ఈ ఒక్కసారికి క్షమించండి సర్, ఇంకోసారి రిపీట్ చేయను” అంటూ వేడుకున్నాడు.
రీతూ స్టాండ్, నాగార్జున కౌంటర్:
అయితే, రీతూ చౌదరి మాత్రం పవన్‌కు గట్టిగా మద్దతు ఇచ్చింది. “అది మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు, నేను వెళ్లిపోతున్న ఆవేశంలో నన్ను గట్టిగా తోశాడంతే. ఇది మా ఇద్దరికీ సంబంధించిన గొడవ. ఈసారికి క్షమించండి” అంటూ పవన్‌కు వకాల్తా పుచ్చుకుంది. దీనిపై నాగార్జున స్పందిస్తూ, “నువ్వు అడిగినా తప్పు కాదని అంటావ్ అని నాకు తెలుసు. మీ ఇద్దరి బాండింగ్ అన్ హెల్తీగా ఉంది” అంటూ రీతూ-పవన్‌ల బంధాన్ని పరోక్షంగా తప్పుబట్టారు.
Also Read: Priyamani: పారితోషికంపై ప్రియమణి ధైర్య వ్యాఖ్యలు!
మోకాళ్లపై కూర్చుని క్షమాపణ:
చివరకు, పవన్ మోకాళ్లపై కూర్చుని, “నేను అలా చేసి ఉండకూడదు, వేరే ఎలాంటి శిక్ష వేసినా భరిస్తాను, ఫ్యూచర్‌లో రిపీట్ చేయను” అని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. హౌస్‌మేట్స్ అందరూ పవన్‌కు మరో అవకాశం ఇవ్వాలని సపోర్ట్ చేయడంతో, ఇది లైఫ్ లెసన్ అంటూ హెచ్చరించి, పవన్‌ను హౌస్‌లోనే కొనసాగనిచ్చారు.
ఇతర కంటెస్టెంట్లకు క్లాస్:
దివ్య: బిర్యానీ గొడవలో క్లారిటీ లేకుండా మధ్యలో కలగజేసుకున్నందుకు, భరణికి వకాల్తా పుచ్చుకున్నందుకు దివ్యకు నాగార్జున గట్టిగా క్లాస్ ఇచ్చారు.
సంజన: నామినేషన్లలోకి రాగానే నోటికి కంట్రోల్ ఉండట్లేదని, ఫుడ్ దగ్గర అలిగి వెళ్లడం కరెక్ట్ కాదని హెచ్చరించారు.
భరణి: రీఎంట్రీ తర్వాత కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నందుకు నాగార్జున వార్నింగ్ ఇచ్చారు.
ఇమ్మాన్యుయేల్: తనూజను నామినేట్ చేయడానికి వీక్ పాయింట్ చెప్పినందుకు, పాత టాస్క్ విషయంలో తప్పుగా మాట్లాడినందుకు వీడియో ప్లే చేసి మరీ ఇమ్మాన్యుయేల్ తప్పును నిరూపించారు.
రాము రాథోడ్: హౌస్‌లో తన పని తాను చూసుకుంటూ, ఇతరుల గొడవలు, ఫీలింగ్స్ పట్టించుకోకుండా వస్తువుల్లా ట్రీట్ చేస్తున్నాడని కెప్టెన్ దివ్యకు ప్రత్యేకంగా సూచించారు.
మొత్తం మీద శనివారం ఎపిసోడ్… సీరియస్ హెచ్చరికలు, భావోద్వేగాలు, గొడవలు, పవన్-రీతూల అన్ హెల్తీ బాండింగ్ అంశాలతో తీవ్ర ఉత్కంఠగా సాగింది.

