Bigg Boss 9

Bigg Boss 9: బిగ్‌బాస్ నటి షాకింగ్ కామెంట్స్: ఆ స్టార్ హీరో నన్ను టార్చర్ పెట్టాడు!

Bigg Boss 9: తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమల్లో నటించి, ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు తొమ్మిదో సీజన్ హౌస్‌లో తన ఆటతీరుతో ప్రేక్షకులకు దగ్గరవుతున్న నటి సంజనా గల్రానీకి సంబంధించిన ఒక పాత ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న వేధింపులు, ఇబ్బందుల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

పలు సూపర్ హిట్ సినిమాలలో నటించిన సంజనా గల్రానీ, ఒక ఇంటర్వ్యూలో తన వృత్తిపరమైన అనుభవాలను పంచుకుంటూ, ఒక కన్నడ స్టార్ హీరో తనను ఎంతగానో టార్చర్ పెట్టాడని ఆరోపించింది. ముఖ్యంగా ఆ హీరో తనను మానసికంగా వేధించాడంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. “ఒక కన్నడ సినిమా షూటింగ్‌ సమయంలో నాకు చాలా ఇబ్బంది ఎదురైంది. ఆ చిత్ర దర్శకుడితో అప్పటికే ఆ స్టార్ హీరోకు గొడవలు జరుగుతున్నాయి. అదే కోపంతో షూటింగ్‌కు వచ్చిన ఆ హీరో నాపై చిరాకు చూపించాడు,” అని సంజన వివరించింది.

ఒక సన్నివేశంలో హీరో తన చేతులను పట్టుకుని ముందుకు కదలాల్సి ఉండగా, కోపంతో వచ్చిన ఆ హీరో తన చేతులను గట్టిగా నొక్కేశాడని సంజన తెలిపింది. “నొప్పిగా ఉందని నేను చెప్పినా, ‘మ్యానేజ్‌ చేసుకో’ అంటూ సీరియస్‌ లుక్ ఇచ్చి మరీ దురుసుగా మాట్లాడాడు. దీంతో నేను వెంటనే షూటింగ్‌ ఆపేసి, ‘నేను దెబ్బలు తినడానికి ఇక్కడికి రాలేదు. ఇదేం యాక్షన్ సీన్ కాదు, నేను విలన్‌ను కూడా కాదు. ఈ సీన్‌కు తగ్గట్టుగా నీ మైండ్‌సెట్‌ మార్చుకో, ఆ తర్వాతే షూట్ చేద్దాం’ అని ఆ హీరోకు గట్టిగా చెప్పాను. దాదాపు అరగంట తర్వాత మళ్లీ ఆ సీన్‌ చేశాం,” అంటూ తన ధైర్యాన్ని ప్రదర్శించిన విషయాన్ని ఆమె పంచుకుంది.

Also Read: Ileana: ఇలియానా సంచలన వ్యాఖ్యలు.. శృంగారం మంచి వ్యాయామం!

నటీమణులకు ఇండస్ట్రీలో ఇలాంటి “క్రాక్ ఉన్నవాళ్లు” తరచుగా ఎదురవుతారని, అయితే వాటిని పట్టించుకోకుండా తమ పనిని కొనసాగించాలని ఆమె పేర్కొంది. తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘బుజ్జిగాడు’ సినిమాతో సంజన గల్రానీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందు ‘సోగ్గాడు’ (2005) ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత ‘సత్యమేవ జయతే’, ‘దుశ్శాసన’, ‘లవ్ యూ బంగారం’ వంటి చిత్రాల్లో నటించింది.

అవకాశాల కోసం ఆశపడి ఇండస్ట్రీలోకి వచ్చే ఎంతో మంది నటీమణులు ఇలాంటి వేధింపులకు గురవుతున్నారని, వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగిన కొందరిలో తాను కూడా ఉన్నానని సంజనా చెప్పుకొచ్చింది. అయితే, తనను వేధించిన ఆ స్టార్ హీరో పేరును మాత్రం ఆమె ఇంటర్వ్యూలో వెల్లడించలేదు. ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినీ పరిశ్రమలో వేధింపుల అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *