Dhanush: తాను నిర్మించిన ‘నానుమ్ రౌడీదాన్’లోని సన్నివేశాలను అనుమతి లేకుండా నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో ఉపయోగించారంటూ నయనతార, నెట్ ఫ్లిక్స్ సంస్థ మీద హీరో, నిర్మాత ధనుష్ కోర్టు కెక్కారు. తనకు నయనతార, నెట్ ఫ్లిక్స్ సంస్థలు నష్టపరిహారంగా పది కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా ధనుష్ కోరాడు. ఈ కేసు కోర్టులో ఉండగా, దీనిని కొట్టివేయాలంటూ నెట్ ఫ్లిక్స్ సంస్థ ఓ పిటీషన్ వేసింది. దీనిని విచారించిన మద్రాస్ హైకోర్టు స్వీకరణకు తిరస్కరించింది. ధనుష్ డిమాండ్ లో న్యాయం ఉందని, దాని మీద వాదోపవాదాలు జరగాల్సిందేనన్ని మద్రాస్ హై కోర్టు అభిప్రాయపడింది. ఫిబ్రవరి 5న ధనుష్… నయనతార, నెట్ ఫ్లిక్స్ పై వేసిన కేసు విచారణకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తమకు ఊరట లభిస్తుందని భావించిన నయనతార, నెట్ ఫ్లిక్స్ కు కోర్టులో చుక్కెదురైందనే చెప్పాలి.
