Big breaking: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రూప కెమికల్స్ సంస్థలో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీగా ఎగసిపడుతున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సమీపంలో ఉన్న సితార ఫ్లోర్ మిల్‌కు మంటలు వ్యాపించే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా చర్యలు తీసుకుంటున్నారు.

