Big Boss 9

Big Boss 9: ‘లవ్ ట్రాక్’ అంటూ రీతూపై ఆయేషా పర్సనల్ అటాక్; తారస్థాయికి చేరిన తనూజ-రమ్య గొడవ

Big Boss 9: బిగ్ బాస్ ఇంట్లో జరిగిన నామినేషన్స్ ప్రక్రియ రణరంగంగా మారింది. కంటెస్టెంట్‌ల మధ్య వాదోపవాదాలు, మాటల తూటాలు పేలాయి. ముఖ్యంగా ఆయేషా జీనత్-రీతూ చౌదరి మధ్య వ్యక్తిగత దూషణలకు దిగడంతో వాతావరణం వేడెక్కింది.

నామినేషన్స్ ప్రక్రియ: 
ఈ వారం నామినేషన్స్ కోసం బిగ్ బాస్ ఒక ప్రత్యేకమైన టాస్క్ ఇచ్చారు. కెప్టెన్‌లు అయిన సుమన్ శెట్టి, గౌరవ్ చెరో కలర్ పిల్ (ఆరెంజ్, బ్లూ) ఎంచుకున్నారు. ఆ పిల్ పవర్‌తో సుమన్ శెట్టి ఇమ్మాన్యుయేల్‌ను, గౌరవ్ ఆయేషాను నామినేషన్ పవర్ కోసం ఎంపిక చేశారు.

తరువాత, ఇమ్మాన్యుయేల్, ఆయేషాలకు బెలూన్ టాస్క్ ఇవ్వబడింది. గదిలోని బెలూన్స్‌ను పగలగొట్టి, నామినేషన్ స్లిప్పులు తీసుకోవాల్సి వచ్చింది. దీనిలో ఆయేషాకు 3 స్లిప్పులు, ఇమ్మాన్యుయేల్‌కు 5 స్లిప్పులు లభించాయి. ఇమ్మాన్యుయేల్ తన స్లిప్పులను కళ్యాణ్, దివ్య నికితా, రమ్య మోక్ష, తనూజ, రీతూ చౌదరిలకు పంచగా, ఆయేషా సంజన, శ్రీనివాస్‌కు చెరో స్లిప్పు ఇచ్చి, మిగిలిన డైరెక్ట్ నామినేషన్ పవర్‌ను తన దగ్గర ఉంచుకుంది.

ఆయేషా తన డైరెక్ట్ నామినేషన్ పవర్‌తో రీతూ చౌదరిని నామినేట్ చేస్తూ పర్సనల్ అటాక్‌కు దిగింది. “నీ ఓవరాక్షన్ ఏమాత్రం నచ్చలేదు. నువ్వు కేవలం లవ్ కంటెంట్ కోసం, సేఫ్ గేమ్ ఆడేందుకే హౌస్‌లోకి వచ్చావు” అంటూ ఆరోపించింది. దీనికి రీతూ సూటిగా కౌంటర్ ఇస్తూ, తాను లవ్ చేస్తున్నట్లు ఎప్పుడైనా చెప్పానా అని ప్రశ్నించింది. అయినా కూడా, ఆడియన్‌గా తన అభిప్రాయం అదే అని ఆయేషా గట్టిగా వాదించింది.

Also Read: Samantha: ఏం జరుగుతుంది బాస్.. దర్శకుడు రాజ్‌ నిడిమోరుతో సమంత దీపావళి వేడుకలు!

తనూజ vs రమ్య
ఈ వారం నామినేషన్స్‌లో తనూజ-రమ్య మోక్ష మధ్య జరిగిన వాదన పతాక స్థాయికి చేరింది. రమ్య, తనూజను నామినేట్ చేస్తూ, ఆమె డ్రామా క్వీన్ అని, ఏ టాస్క్ సొంతంగా ఆడకుండా కేవలం బాండింగ్స్‌పై ఆధారపడి ఉంటుందని, ఆమె ముసుగులో ఉండి ఫేక్ గేమ్ ఆడుతోందని ఆరోపించింది. “నీ గేమ్ వల్ల భరణి వంటి వారికి నష్టం జరిగింది” అని రమ్య మండిపడింది.

రమ్య ఆరోపణలకు అంతే దీటుగా స్పందించిన తనూజ, బ్యాక్ బిచ్చింగ్ గురించి మాట్లాడే ముందు రమ్య తన మాస్క్‌ను చూసుకోవాలని చెప్పింది. హౌస్‌లో తాను గేమ్ ఆడకుండానే గత వారం ఎలా సేఫ్ అయ్యానని ప్రశ్నించింది. రమ్య తనను ముసుగు దొంగ అనగానే, “అవును నేను ముసుగు దొంగనే, అది చెప్పడానికి నువ్వెవరు? నీ వయసుకు తగ్గట్లు ప్రవర్తించు” అని ఫైర్ అయింది.

తనూజ తిరిగి రమ్యను నామినేట్ చేస్తూ, రమ్య తెచ్చిన ఓవరాక్టింగ్, సెల్ఫిష్, ఫేక్ అనే ట్యాగ్‌లు ఆమెకే సరిపోతాయని చెప్పింది. “నువ్వు జెలస్ రాణి” అని రమ్య రెచ్చగొట్టగా, తనూజ తనదైన శైలిలో విజిల్ వేసి, “ఒక్కోసారి రెండు చేతుల చప్పట్ల కన్నా ఒక్క చేతి విజిల్ గట్టిగా వినిపిస్తుంది” అంటూ కౌంటర్ ఇచ్చింది.

ఫైనల్ నామినేషన్స్
చివరికి, కెప్టెన్ గౌరవ్ తన ‘సేవ్ ఎనీ ఒన్’ పవర్‌ను ఉపయోగించి ఆయేషాను నామినేషన్స్ నుంచి రక్షించాడు. దీంతో ఈ వారం మొత్తం 8 మంది కంటెస్టెంట్‌లు – రీతూ చౌదరి, కళ్యాణ్, తనూజ, రాము, దివ్య నికితా, సంజన, రమ్య మోక్ష, శ్రీనివాస సాయి – ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు. వీరిలో వైల్డ్‌కార్డ్ ఎంట్రీల నుంచి కేవలం ఇద్దరు మాత్రమే ఉండటం గమనార్హం.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *