Vizag: విశాఖపట్నం నగరంలోని ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో గురువారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హిమాలయ బార్ సమీపంలో గ్యాస్ సిలిండర్ పేలి తీవ్ర ప్రమాదం జరిగింది. ఈ పేలుడులో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
పేలుడు ధాటికి పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు చోటు చేసుకున్నాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని సమీపంలోని కేజీహెచ్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే గ్యాస్ లీకేజే పేలుడుకు కారణమని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పేలుడు సమయంలో అక్కడ పనిచేస్తున్న కార్మికులు, స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఘటనతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తత చరమానంలా మారింది.