Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్ పెట్టారు. ఆయన ‘ఎక్స్’ ఖాతా ద్వారా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఒక పెద్ద ప్రకటన చేయనున్నట్లు తెలియజేశారు. ఈ ప్రకటనకు సంబంధించిన ఇప్పటి నుంచి రాజకీయ వర్గాలో, సామాజిక మాధ్యమాల్లో ఉత్కంఠమైన చర్చలకు దారితీసింది.
లోకేష్ ట్వీట్‌లో చెప్పినట్లుగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనలో తీసుకువచ్చిన సంస్కరణలు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అవార్డు పొందినట్లు తెలిపారు. ఈ అవార్డును బలమైన, విశ్వసనీయ జ్యూరీ ఎంపిక చేసింది. అయినప్పటికీ, ఏ అవార్డు, ఎవరు విజేత అన్న వివరాలను మంత్రి ఈ మధ్యాహ్నం 12 గంటలకు వెల్లడిస్తానని పేర్కొన్నారు.
Also Read: Ram Suthar: భారత శిల్పకళా దిగ్గజం అస్తమయం.. రామ్ సుతార్ కన్నుమూత!
లోకేష్ వ్యాఖ్యలలో, “నినాదాలకంటే సంస్కరణలు గట్టిగా ఉంటే గుర్తింపు స్వయంగా వస్తుంది” అని పేర్కొని, ప్రభుత్వ విధానాలు ప్రజలకు గుర్తింపు పొందుతాయని సూచించారు. ఈ ట్వీట్ తరువాత రాజకీయ, మాధ్యమ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇదొక ఆసక్తికర విషయం, ఎందుకంటే ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక విధానాలు ఇప్పుడు అంతర్జాతీయ, జ్యూరీ గుర్తింపు పొందడం ద్వారా మరింత ప్రతిష్ట పొందుతున్నాయి.
When governance reforms speak louder than slogans, recognition follows.
A highly respected award. A formidable jury.
Which award is this? Guess who won? BIG REVEAL at 12 noon.
— Lokesh Nara (@naralokesh) December 18, 2025

