Bhubaneswar Metro Rail

Bhubaneswar Metro Rail: భువనేశ్వర్ మెట్రో ప్రాజెక్ట్‌ను రద్దు చేసిన ప్రభుతవం.. ఎందుకంటే..?

Bhubaneswar Metro Rail: భువనేశ్వర్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన రెండు టెండర్లను ఒడిశా బిజెపి ప్రభుత్వం రద్దు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయంపై మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ, ఈ నిర్ణయం ప్రజలకు ద్రోహం చేయడమేనని, నగరం కనీసం 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తుందని విమర్శించారు. తన హయాంలో భువనేశ్వర్‌ను ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మెట్రో ప్రాజెక్టును ప్రారంభించామని ఆయన గుర్తు చేశారు. మెట్రో రైలు నగర రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చేసి, రద్దీ తగ్గించడమే కాకుండా నగర విస్తరణకు కూడా సహకరించేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఒడిశా ప్రభుత్వం అయితే కొత్త DPR (వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక) తయారు చేయాల్సిన అవసరం ఉందని చెబుతోంది. ఈ కారణంగానే DMRC (ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్) రంజిత్ బిల్డ్‌కాన్, సీగల్ ఇండియా లిమిటెడ్‌లకు ఇచ్చిన కాంట్రాక్టులు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర గృహనిర్మాణం మరియు పట్టణాభివృద్ధి మంత్రి కృష్ణ చంద్ర మహాపాత్ర మాట్లాడుతూ, కొత్త DPRను కేంద్రానికి ఆమోదం కోసం పంపుతామని చెప్పారు.

ఇది కూడా చదవండి: Chandrababu Naidu: గతంలో పొరపాట్లు సరిదిద్దాలనే సింగపూర్‌ వచ్చా

మంత్రి మహాపాత్ర ప్రకారం, గత బిజెడి ప్రభుత్వం కేంద్ర సహాయం తీసుకోకుండా ప్రాజెక్టును ప్లాన్ చేసిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం దీనిని కేంద్రంతో జాయింట్ వెంచర్‌గా రూపొందించాలని నిర్ణయించిందని తెలిపారు. కొత్త ప్రణాళిక మరింత ఆచరణీయంగా ఉండబోతోందని ఆయన చెప్పారు.

భువనేశ్వర్ మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశలో 26 కి.మీ పొడవు, 20 స్టేషన్లు ఉండేలా రూపకల్పన చేశారు. బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి త్రిసులియా స్క్వేర్ వరకు రూ.5,000 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలనే ప్రణాళిక రూపొందించారు. రోడ్లపై రద్దీ తగ్గించడంతో పాటు సురక్షితమైన, వేగవంతమైన, పర్యావరణహిత రవాణా అందించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *