Bhool Bhulaiyaa 3: ‘భూల్ భులయ్యా -3’ టైటిల్ ట్రాక్ ను దేశవ్యాప్తంగా శ్రోతలకు చేరవేసే పనిని ఆ సినిమా కథానాయకుడు కార్తీక్ ఆర్యన్ భుజానికెత్తుకున్నాడు. ఇందులో భాగంగా సహ నటి విద్యాబాలన్ తో కలిసి హైదరాబాద్ లో జరుగుతున్న ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభ వేడుకలకు హాజరయ్యాడు. గతంలో ఈ పాటను ఢిల్లీ, ఇండోర్ లో కార్తిక్ ఆర్యన్ రిలీజ్ చేశాడు. ‘భూల్ భులయ్యా’ టైటిల్ ట్రాక్ ను దిల్జిత్ దోసాంజ్ పాడాడు. ఇందులో రూహ్ బాబాగా మరోసారి కార్తీక్ ఆర్యన్ నటిస్తున్నాడు. ఇతర కీలక పాత్రలను త్రిప్తి డిమ్రీ, మంజులిక, విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ పోషిస్తున్నారు. అనీస్ బాజ్మీ దర్శకత్వంలో భూషణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 1న జనం ముందుకు రాబోతోంది.
